టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం బాలీవుడ్ నటులకు ప్రాధాన్యత పెరుగుతోంది. హిందీలో హీరోలు గా గుర్తింపును సంపాదించుకున్న వాళ్లను తెలుగులో విలన్లుగా నటింపజేయడానికి టాలీవుడ్ స్టార్స్ ఆసక్తి చూపిస్తున్నారు.బాలీవుడ్ హీరోయిన్లకు సైతం తెలుగులో ప్రాధాన్యత పెరుగుతుండటం గమనార్హం. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో దేవర టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం సైఫ్ అలీ ఖాన్ ఏకంగా 14 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని దేవర మేకర్స్ సైతం ఆ మొత్తం ఇవ్వడానికి అంగీకరించారని తెలుస్తోంది. ఇదే సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. జాన్వీకి రెమ్యునరేషన్ కోసం 4 కోట్ల రూపాయలు ఇస్తున్నారని అదనపు ఖర్చులకు సంబంధించి ఆమెకు కోటి రూపాయల వరకు అందుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

సీతారామం సక్సెస్ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మృణాల్ ఠాకూర్ కు ఊహించని స్థాయి లో డిమాండ్ పెరిగిందనే సంగతి తెలిసిందే. ఈ బ్యూటీకి నిర్మాతలు ఏకంగా 3 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం ఇస్తున్నారట. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే మృణాల్ ఠాకూర్ పారితోషికం మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.మృణాల్ ఠాకూర్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు రామ్ పూరీ కాంబినేషన్ మూవీలో సంజయ్ దత్ విలన్ గా ఎంపికైనట్టు భోగట్టా. ఈ సినిమా కోసం సంజయ్ దత్ ఏకంగా 10 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ లో బాలీవుడ్ హీరోయిన్లు, విలన్లు సత్తా చాటుతుండటం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ అవుతోంది. రాబోయే రోజుల్లో టాలీవుడ్ లో బాలీవుడ్ నటుల హవా మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: