ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రావు వ్య‌వ‌హారం రోజు రోజుకు ముదురుతోంది. త‌న‌ను వైసీపీ హ‌యాం లో నిర్బంధించి పోలీసులు కొట్టార‌న్న విష‌యం నుంచి ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా, యూట్యూబ్ చానెళ్ల‌లో వ‌స్తున్న వార్త‌లు, విశ్లేష‌ణ‌ల వ‌ర‌కు.. అనేక అంశాలు..ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. పైగా.. రోజు రోజుకు రాజుకుంటున్నాయి. ఇవి వ్య‌క్తిగ‌తంగా ర‌ఘురామ‌కు ఎలాంటి న‌ష్టం క‌లిగిస్తాయ‌న్న విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. కూట‌మి స‌ర్కారుకు మాత్రం ఇబ్బందిక‌ర‌పరిణామాలు తీసుకువ‌స్తాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.


త‌న‌ను హింసించారంటూ.. ర‌ఘురామ గ‌త కేసునుత‌వ్వి తీశారు. ఈ క్ర‌మంలో అప్ప‌టి సీఐడీ చీఫ్‌గా వ్య‌వ హరించిన ఐపీఎస్ సునీల్ కుమార్‌పై కేసు పెట్టారు. ఈ విష‌యంలో ప్ర‌భుత్వం కూడా వెంట‌నే చ‌ర్య‌లు తీసుకుంది. సంబంధిత అధికారుల‌ను స‌స్పెండ్ చేసింది. అదేవిధంగా గుంటూరు జిల్లా ఆసుప‌త్రి సూప రింటెండెంట్‌పైనా స‌స్పెన్ష‌న్‌వేటు వేసింది. ప్ర‌స్తుతం ఈ కేసు ముందుకు సాగుతోంది. కానీ.. ఇంత‌లోనే సునీల్ వ‌ర్సెస్ ర‌ఘురామ‌ల మ‌ధ్య వ్య‌క్తిగ‌త విభేదాలు తెర‌మీదికి వ‌చ్చాయి.



ఇవి ముదిరి పాకాన ప‌డుతున్న స‌మ‌యంలో ర‌ఘురామ‌పై ఉన్న ఆర్థిక కేసుల వ్య‌వ‌హారంపై సుప్రీంకోర్టు కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇవి స‌హ‌జంగానే ర‌ఘురామ ప్ర‌త్య‌ర్థుల‌కు అస్త్రాలుగా మారి.. సోష‌ల్ మీడియాలోను.. యూట్యూబుల్లోనూ విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఇవ‌న్నీ కామ‌న్‌. కానీ.. ర‌ఘురామ వీటికి కూడా రియాక్ట్ అయ్యారు. ఫ‌లితంగా నోరు జారే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇది మ‌రింత ప్ర‌మాద క‌రంగా మారింది.ఇప్పుడు ర‌ఘురామ‌ను కార్న‌ర్ చేస్తూ.. అవే సంస్థ‌లు మ‌రింత రెచ్చిపోతున్నాయి.



అయితే.. ఈ వ్య‌వ‌హారాలు నిన్న మొన్న‌టి వ‌ర‌కు వ్య‌క్తిగ‌త‌మ‌ని అనుకున్నా.. ఇప్పుడు కూట‌మి స‌ర్కారుకు కూడా సెగ పెరుగుతోంది. ర‌ఘ‌రామ విష‌యాన్ని తేల్చాల‌ని.. ఎవ‌రో ఒక‌రు పెద్ద‌రికం వ‌హించి.. ఈ విష యం పెద్ద‌ది కాకుండా చూసుకుంటే బెట‌ర్ అన్న సూచ‌న‌లు వ‌స్తున్నాయి. లేక‌పోతే.. అంతిమంగా ప్ర‌భు త్వానికి ఉభ‌య ప‌క్షాల నుంచి కూడా స‌మ‌స్య వ‌చ్చే ఛాన్స్ ఉంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. కాబ‌ట్టి సాధ్య‌మైనంత వేగంగా ఈ ఎపిసోడ్‌కు.. ముగింపు ప‌లికేలా.. పెద్ద‌లు జోక్యం చేసుకోవాల‌న్న సూచ‌న‌లు వ‌స్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: