మెగాస్టార్ చిరంజీవి, తమన్నా కలిసి నటించిన తాజా చిత్రం భోళా శంకర్. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇందులో కీర్తి సురేష్ కూడా నటించిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు పోస్టర్ టీజర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.కాగా ఇందులో యువ హీరో సుశాంత్ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అల వైకుంఠపురంలో అల్లు అర్జున్ పక్కన ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించిన తర్వాత మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించే అవకాశాన్ని దక్కించుకొన్నారు. కాగా ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా సుశాంత్ మీడియాతో మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చూస్తూ ఆయనకు అభిమానిగా మారిపోయాను.

ఆయన చేసే డ్యాన్సులు అంటే పిచ్చి. ఆయన పాటలకు డ్యాన్సులను ప్రాక్టీస్ చేసే వాడిని. ఆయన సాంగ్ షూటింగుకు వెళ్లి చాలా సార్లు చూశాను. ఆయనతో కలిసి సినిమాల్లో నటించాలని ఆలోచనే చాలా ఉత్సాహాన్ని, కొత్త అనుభూతిని కలిగిస్తుంది.అలాంటి ఫీలింగ్‌తో ఉన్న నాకు డైరెక్టర్ మెహర్ రమేష్ ఫోన్ చేసి భోళా శంకర్ మూవీలో ఆఫర్ గురించి చెప్పడంతో చాలా హ్యపీగా ఫీలయ్యాను అని సుశాంత్ చెప్పుకొచ్చారు. భోళా శంకర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పక్కన నటించే అవకాశం రావడం అదృష్టంగా భావించాను.ఆయనతో కలిసి పాటలకు స్టెప్పులేసే ఛాన్స్ ఎంత మందికి దక్కుతుంది. ఈ సినిమాలో ఆఫర్ గురించి చెప్పగానే చిరంజీవితో కలిపి నాతో స్టెప్పులేయించాలని మెహర్ రమేష్ నుంచి మాట తీసుకొన్నాను. ఆయనతో కలిసి డ్యాన్స్ చేయడం గొప్ప అనుభూతి అని సుశాంత్ తెలిపారు. భోళా శంకర్ సినిమాలో నాది గెస్ట్ రోల్.

నా రోల్ సినిమాలో కీలకంగా ఉంటుంది. చిరంజీవి, కీర్తి సురేష్, తమన్నా భాటియాతో నాకు కీలకమైన సన్నివేశాలు ఉంటాయి.హీరోగా నా మొదటి సినిమాలో తమన్నా హీరోయిన్. భోళా శంకర్ మూవీలో నేను, తమన్నా మాత్రం అక్కా, తమ్ముళ్లుగా నటించాం. చిరంజీవి, కీర్తి సురేష్‌తో సన్నివేశాల్లో నటించినప్పుడు చెప్పలేని అనుభూతి కలిగింది అని సుశాంత్ తెలిపారు.చిరంజీవి మెగాస్టార్ అయినప్పటికీ ఆయన తోటి నటీనటులకు కంఫర్ట్ జోన్ ఇస్తారు. ఒక సన్నీవేషంలో ఆయన ట్యాక్సీ డ్రైవర్ నేను కారులో నుంచి దిగుతుంటే ఆయన కారు డోర్ తీయాలి. ఆయన డోర్ తీస్తుంటే నాకు గిల్టీగా అనిపించింది. దాంతో నేనే కారు డోర్ తీసుకొని వస్తుంటే ఆయన వారించారు. నేనే కారు డోర్ తీయాలి లేకపోతే మీ క్యారెక్టర్‌కు ఉండే రెస్పెక్ట్ పోతుందని చిరంజీవి గారు చెప్పగానే ఆయన మెగాస్టార్ ఎందుకయ్యాడో నాకు అర్ధమైంది. ఆ వెంటనే సీన్ షూట్ సందర్భంగా నేను పూర్తిగా కంఫర్ట్ జోన్‌లోకి వెళ్లాను అని తెలిపాడు సుశాంత్.

మరింత సమాచారం తెలుసుకోండి: