
ఈ రోజున మహేష్ బాబు 48 వ బర్త్ డే సందర్భంగా మహేష్ సినిమాల గురించి వరుస అప్డేట్లు విడుదలవుతున్నాయి. అలా గుంటూరు కారం సినిమా నుంచి అదిరిపోయే పోస్టర్తో చిత్ర బృందం ఒక పోస్టర్ని విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టర్లో మహేష్ బాబు మాస్ లుక్ లో కనిపించడంతో అందరిని ఆకట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా పంచ కట్టు స్టైలిష్ గా సిగరెట్ తాగుతూ ఉన్నట్లు కనిపిస్తున్నారు మహేష్ బాబు. ఇక ఈ సినిమా వచ్చే యేడాది జనవరిలో 12 వ తేదీన విడుదల కాబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
ఇందులో కీలకమైన పాత్రలో ప్రకాష్ రాజ్ ,ఆలీ, రమ్యకృష్ణ, జగపతి బాబు, సునీల్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. మరి కేవలం ఈ సినిమా విడుదల సమయానికి ఇక ఐదు నెలలే మిగిలి ఉందని చెప్పవచ్చు ఈ సినిమా పూర్తి చేసి డైరెక్టర్ రాజమౌళితో మహేష్ తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈరోజు మహేష్ బాబు బర్త్డే సందర్భంగా రాజమౌళి సినిమా నుంచి ఏదైనా అదిరిపోయే అప్డేట్ వినిపిస్తుందేమో అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి పూర్తి సమాచారం కోసం వెయిట్ చేయాల్సిందే.