జైలర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు ఏకంగా 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సత్తా చాటింది. ఇక ఈ సినిమా చూసేందుకు అటు ప్రేక్షకులు అందరూ థియేటర్లకు బారులు తీరుతూ ఉన్నారు అని చెప్పాలి. ఇక రజిని ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేకుండా పోయాయి. చాలా రోజుల తర్వాత రజిని సూపర్ హిట్ సాధించడంతో ఫ్యాన్స్ థియేటర్ల వద్ద తెగ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు రజనీకాంత్ జైలర్ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. రజిని నటించిన జైలర్ సినిమా అటు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఓ సినిమాకు కాపీ అంటూ కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా జైలర్ కథ చూస్తే గుడిలో విగ్రహం చోరీ ద్వారా కథ మొదలవుతుంది. రజనీకాంత్ ఒక రిటైర్టు జైలర్. అతని కొడుకు డ్రగ్స్ కార్యకలాపాలపై నిఘా పెట్టిన ఏసిపి. అతని ఒక క్రైమ్ గ్యాంగ్ కిడ్నాప్ చేసి చంపేస్తుంది. దీంతో రిటైర్డ్ జైలర్ కుటుంబం క్రైమ్ గ్యాంగ్ పై ప్రతీకారం తీర్చుకోవడం స్టోరీ. ఈ కథ చూస్తే హిందీలో అమితాబచ్చన్ ప్రధాన పాత్రలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బుడ్డా హోగా తేరే బాప్ లక్షణాలు కనిపిస్తున్నాయి. పోలీస్ అయిన తన కొడుక్కి ప్రమాదాలు ఎదురైతే అడ్డం పడి ఫైట్లు చేసే వృద్ధ తండ్రి పాత్రలో అమితాబచ్చన్ నటించారు. ఇప్పుడు రజినీకాంత్ కూడా అలాంటి పాత్రలోనే చూస్తున్నాం ఇక క్లైమాక్స్ లో కమల్ హాసన్ భారతీయుడు చాయలు కనిపిస్తున్నాయని కొంతమంది ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి