గ్లోబల్ సుందరి ప్రియాంక చోప్రా అంటే.. ఎవ్వరు మాత్రం ఇష్టపడరు. ఆమె డస్కీ అందానికి ఎవ్వరు మాత్రం అభిమాని కాకుండా ఉండగలరు. బాలీవుడ్ అందాల భామగా ఆమెకు బాలీవుడ్ లోనే కాకుండా అటు ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి క్రేజ్ ఉంది.అందుకే ప్రియాంక చోప్రా తో సినిమాలు చేయడానికి పలువురు హాలీవుడ్ దర్శకులు కూడా ఆసక్తి చూపించారు. ఇక లోకల్ దర్శకుల ఎలా ఫీల్ అవుతారో ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. అయితే బాలీవుడ్ దర్శకులకు మాత్రం తమ సినిమాలో ఈ గ్లోబల్ సుందరిని నటించడానికి ఒప్పించడం అంత ఈజీగా కుదరడం లేదట.

అయితే ఓ కుర్ర దర్శకుడు ఏకంగా తనకు ప్రియాంక చోప్రా తో పనిచేయాలని ఉందని చెబుతున్నాడు. ఇంతకి ఆ దర్శకుడు ఎవరు అంటే.. సందీప్ రెడ్డి వంగా. తెలుగు లో భారీ కలెక్షన్స్ ను రాబట్టిన 'అర్జున్ రెడ్డి' చిత్రాన్ని తెరకెక్కించింది ఈ దర్శకుడే. అయితే తన ఫ్రెండ్స్ గ్రూప్ లో మాట్లాడుతూ.. ఇండియన్ నటీనటులలో మీకు ఎవరితో కలిసి పని చేయాలని ఉంది ? అంటూ క్వశ్చన్ చేశారు ఆయన సన్నిహితులు. ఈ సందర్భంగా సందీప్ రెడ్డి తన మనసులోని మాటను బయటపెట్టాడు. తనకు ఇండియన్ నటీమణుల్లో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా అంటే ఇష్టం అని తెలిపాడు.

ఒకవేళ తనకు ఛాన్స్ వస్తే.. ప్రియాంక చోప్రా తో తానూ కలిసి పని చేస్తానని చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం ప్రియాంక చోప్రా విషయానికి వస్తే.. ఆమె హాలీవుడ్ కి వెళ్ళాక రెగ్యులర్ గా ఇండియన్ సినిమాలను కంటిన్యూ చెయ్యట్లేదు. కానీ మంచి కథ దొరికితే ఇక్కడి సినిమాల్లో కూడా నటించడానికి రెడీగా ఉంది. ఇక ఇప్పటికే కమర్షియల్ యాడ్స్ లో మాత్రం ఆమె ఫుల్ బిజీగా ఉంది. ఏది ఏమైనా ప్రియాంక చోప్రా క్రేజ్ రోజురోజుకు పెరుగుతూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: