ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఇటీవల కాలంలో ఎంతల పాపులర్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినీ సెలబ్రిటీల జాతకాలు చెబుతూ అందరికీ పర్సనల్ ఆస్ట్రాలజర్ గా మారిపోయారు. అయితే వేణు స్వామి చెప్పిన ఎన్నో విషయాలు నిజం కావడంతో ప్రేక్షకులే కాదు    సినీ సెలబ్రిటీలు కూడా ఆయనను నమ్మడం మొదలుపెట్టారు. ఎంతో మంది హీరోయిన్లు తమ కెరియర్ బాగుండాలని కోరుకుంటూ ఇక వేణు స్వామితో ప్రత్యేకంగా పూజలు చేయించుకోవడం కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.


 అయితే ఎప్పుడు ఎంతో మంది స్టార్ హీరోల భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు వేణు స్వామి. దీంతో ఇక వేణు స్వామి అంటే ఇప్పుడు తెలియని తెలుగువాడు లేకుండా పోయాడు అని చెప్పాలి. ఇక ఎప్పటికప్పుడు యూట్యూబ్లో ఇంటర్వ్యూలు ఇస్తూ ఫలానా హీరోయిన్ ఈ స్థాయిలో ఉంటుంది. ఫలానా హీరో ఇలా హిట్టు కొడతాడు అంటూ షాకింగ్ విషయాలు చెబుతాడు. ఇక ఇవి నిజంగానే నిజం అవుతున్నాయి. అయితే ఇక టాలీవుడ్ లో ఐకానిక్ స్టార్ట్ గా కొనసాగుతున్న అల్లు అర్జున్ జాతకం కూడా చెప్పాడు వేణు స్వామి.


 తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ ఉన్నత స్థాయికి ఎదుగుతాడని ఏకంగా పాన్ వన్ ఇండియా హీరోగా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటాడని వేణు స్వామి తెలిపాడు.  అయితే ఇక వేణు స్వామి ఇలా అల్లు అర్జున్ జాతకం లో చెప్పిన విషయం నిజంగానే నిజమైంది. ఇటీవలే బన్నీకి నేషనల్ అవార్డు రావడంతో ఏడాది క్రితం వేణు స్వామి చెప్పిన జాతకం నిజమైందని అభిమానులు మరోసారి ఇక ఆయన వ్యాఖ్యలను వైరల్ గా మారుస్తున్నారు. అల్లు అర్జున్ తెరమీద కనిపిస్తే చాలు సినిమాకు 300 కోట్లు వస్తాయని.. ఒక్కో సినిమాకి 100 కోట్లు తీసుకుంటాడని.. నిజమైన పాన్ ఇండియా స్టార్ట్ అవుతాడని వేణు స్వామి గతంలో చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: