పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలలో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్న సినిమా ఓజి. ఈ మూవీ పై పవన్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకోవడానికి ప్రధాన కారణం ఈ సినిమాలో పవన్ చాలా సంవత్సరాల తర్వాత గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపిస్తూ ఉండడం. ఇకపోతే నిన్న అనగా సెప్టెంబర్ 2 వ తేదీన పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఓ చిన్న టీజర్ ను విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఇకపోతే ఇందులో పవన్ అదిరిపోయే గెటప్ లో ఉండడం ... అలాగే విలన్ లను వెంటాడి వేటాడే నరికి చంపుతూ ఉండే సన్నివేశాలు అదిరిపోయే రేంజ్ లో ఉండడం ... అలాగే తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్స్ సూపర్ సాలిడ్ గా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఇకపోతే ఈ సినిమాకు సూపర్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ప్రియాంక అరుల్ మోహన్మూవీ లో పవన్ సరసన హీరోయిన్ గా కనిపించనుంది.

డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో ... అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ మేకర్స్ ఉన్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఓజి మూవీ మొత్తం గా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా రెండు పార్ట్ లను కూడా తెలుగు , తమిళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: