వీరిద్దరూ కలిసి ఒక్కసారి బుల్లితెరపై ఏదైనా షోలో కనిపించారు అంటే చాలు కోట్ల మంది ప్రేక్షకులు తెగ మురిసిపోతూ ఉంటారు. ఇక ఇద్దరు పెళ్లి చేసుకుంటే చూడాలనుకుంటున్న ప్రేక్షకులు కూడా కోట్లలోనే ఉన్నారు అని చెప్పాలి. జబర్దస్త్ లో లవ్ ట్రాక్ కారణంగానే సుధీర్ కూడా ఊహించని రీతిలో గుర్తింపు సంపాదించుకున్నాడు. కానీ ఆ తర్వాత అనూహ్యంగా జబర్దస్త్ షో నుంచి తప్పుకున్నాడు. అయితే చాలా బ్రేక్ తర్వాత ఇటీవల సుధీర్ ఈటీవీలో ఒక షోలో ప్రత్యక్షమయ్యాడు. దీంతో మరోసారి రష్మీ, సుధీర్ ను ఒకచోట చూసి ఫాన్స్ ఫిదా అయిపోయారు..
అయితే ఇక ఇటీవలే ఈవెంట్లో మరోసారి రష్మీ సుధీర్ ప్రేమలో మునిగి తేలారు. ఈ ఈవెంట్లో కలిసి యాంకరింగ్ చేశారు. నిజమేనా చెబుతున్న జానే జానా పాటకు డాన్స్ చేశారు. ఇక వీరిద్దరి కెమిస్ట్రీ ఇన్నేళ్లయినా ఎక్కడ తగ్గలేదు. అయితే ఈ పర్ఫామెన్స్ తర్వాత రష్మీతో తన బాండింగ్ గురించి సుదీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. రష్మితో తనది బ్యూటిఫుల్ జర్నీ అని సుదీర్ చెప్పగానే ఉత్త జర్నీనా లవ్ జర్నీనా అని గెటప్ శీను పంచు వేస్తాడు. దీనికి రిప్లై ఇచ్చిన సుదీర్.. బేసికల్ గా రష్మీ సెన్సిటివ్. చాలా కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి. నాకు అందరికంటే రష్మీ చాలా ఎక్కువ అని రష్మీపై పొగడ్తల వర్షం కురిపించాడు. నా జర్నీలో నా సక్సెస్ లో రష్మీదే మెయిన్ రోడ్. కెరియర్ లో నేను ముందుకెళ్లడానికి రష్మీ పాత్ర ఎంతో ఉంది అంటూ చెప్పుకొచ్చాడు సుధీర్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి