ఈ అరుదైన అవార్డును అందుకున్న మొదటి తెలుగు హీరోగా చరిత్ర సృష్టించాడు అని చెప్పాలి. అయితే మొన్నటి వరకు తెలుగు ప్రేక్షకులకు స్టైలిష్ స్టార్ గా కొనసాగిన అల్లు అర్జున్ ఇక ఇప్పుడు ఐకానిక్ స్టార్ గా మారిపోయాడు అని చెప్పాలి. అయితే ఇక తన కెరీర్ ను నిలబెట్టిన ఒక వ్యక్తికి జీవితాంతం రుణపడి ఉంటాను అంటూ అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు. అయితే ఇలా అల్లు అర్జున్ జీవితాంతం రుణపడి ఉంటాను అని చెప్పిన వ్యక్తి ఎవరో కాదు సుకుమార్. ఆర్య మూవీతో సుకుమార్, అల్లు అర్జున్ బాండింగ్ ప్రారంభమైంది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వటంతో అల్లు అర్జున్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.
ఇక ఆ తర్వాత వీరి కాంబినేషన్లో వచ్చిన ఆర్య 2 సినిమా యావరేజ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ.. ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్స్ యాక్టింగ్ కి మాత్రం మంచి పేరు వచ్చింది అని చెప్పాలి. ఇక ఇటీవల పుష్ప సినిమాతో ఏకంగా అల్లు అర్జున్ ను పాన్ ఇండియా రేంజ్ హీరోగా మార్చేశాడు. సుకుమార్. అయితే ఆర్య మూవీ సమయంలో సుకుమార్తో నడవాలని నిర్ణయం తీసుకోవడం వల్లే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటూ అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. ఆరోజు వేరే నిర్ణయం తీసుకుని ఉంటే ఈ స్థాయిలో ఉండే వాడిని కాదు అంటూ తెలిపాడు. ఒకానోకు సమయంలో నేను వెనక్కి తిరిగి చూసుకుంటే.. ఇంత దూరం ఎలా వచ్చాను అని భావిస్తే నాకు సుకుమారు కనిపించారు అంటూ బన్నీ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. గుండె మీద చేయి వేసుకొని నేను ఒకే మాట చెప్పగలను. సుకుమార్ లేకపోతే నేను లేను.. నేను లైఫ్ లాంగ్ అతనికి రుణపడి ఉంటా అంటూ తన కృతజ్ఞత భావాన్ని చాటుకున్నాడు అల్లు అర్జున్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి