టీజర్ తో ఈ మూవీ పై ఏర్పడ్డ అంచనాలను అందుకునేందుకు.. మూవీ టీం గ్రాఫిక్స్ విషయంలో చాలా క్వాలిటీ మెయిన్‌టైన్ చేయాలని నిర్ణయించుకుంది. అందుకనే బెటర్ వర్క్ తో వచ్చేందుకు వాయిదా వేస్తున్నట్లు దర్శకనిర్మాతలు తెలియజేశారు. ఈ పోస్ట్‌పోన్ పక్కనబెడితే.. మూవీకి టీం ఇప్పటివరకు ఎటువంటి ప్రమోషన్స్ ని మొదలు పెట్టలేదు. తాజాగా దీని గురించి దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒక అప్డేట్ ఇచ్చాడు.ఈ వినాయక చవితి నుంచి హనుమాన్ మూవీ ప్రమోషన్స్ మొదలు పెడతామంటూ ప్రశాంత వర్మ పోస్ట్ చేశాడు. మరి చవితి నాడు ఏం అప్డేట్ ప్లాన్ చేశాడో చూడాలి. అమృత అయ్యర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. వినయ్ రాయి విలన్ పాత్ర చేస్తుంటే వరలక్ష్మి శరత్ కుమార్, వెన్నల కిశోర్, సత్య, గెటప్ శ్రీను ముఖ్య పాత్రలు చేస్తున్నారు. నిరంజన్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. వరల్డ్ వైడ్ గా మొత్తం 11 భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.
2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. కాగా సంక్రాంతి రేసులో బడా హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. మహేష్ బాబు 'గుంటూరు కారం', రవితేజ 'ఈగల్', ప్రభాస్ 'కల్కి 2898 AD' చిత్రాలు ఉన్నాయి. మరి వీటిని తట్టుకొని హనుమాన్ మూవీ ఎటువంటి విజయం అందుకుంటుందో చూడాలి. కాగా తేజ సజ్జ, ప్రశాంత వర్మ కాంబినేషన్ లో గతంలో వచ్చిన 'జాంబీ రెడ్డి' మూవీ మంచి విజయం అందుకుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి