తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగినటువంటి నవీన్ పోలిశెట్టి , అనుష్క శెట్టి కాంబినేషన్ లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి మహేష్ బాబు పి దర్శకత్వం వహించగా ... వంశీ , ప్రమోద్ లు ఈ సినిమా యు వి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ మూవీ సెప్టెంబర్ 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా విడుదలకు ముందే ఈ మూవీ నుండి ఈ చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది.

 అలా మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా విడుదల ఆయన మొదటి రోజే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా డీసెంట్ కలెక్షన్ లు దక్కుతున్నాయి. దానితో ఇప్పటికే ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా జరుపుకున్న ప్రి రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలక్షన్ లను వసూలు చేసి ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ఫార్మలా ను కంప్లీట్ చేసుకుని లాభాలను అందుకుంటుంది.

 ఇకపోతే ఈ మూవీ "యూ ఎస్ ఏ" లో కూడా అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ సినిమా 1.4 మిలియన్ ప్లస్ కలెక్షన్ లను "యూ ఎస్ ఏ" లో వసూలు చేసినట్లుగా ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసేది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమాని సెప్టెంబర్ 15 వ తేదీన మలయాళం లో కూడా విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా మలయాళ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: