తమిళనాడుకు చెందిన ఈ చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్ గా భారీ రెమ్యునరేషన్ తీసుకుంటుందట. ఐదు సంవత్సరాల వయసులోనే సినిమా ఇండస్ట్రీ లోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టినటువంటి సారా అర్జున్ దాదాపు తెలుగు తమిళ హిందీ భాషలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించే గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఈమె ఒక సినిమాలో నటించాలి అంటే లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.
ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ గా లక్షల్లో రెమ్యూనరేషన్ అందుకోవడం అంటే మామూలు విషయం కాదు.అందానికి అందం నటనకు నటనతో అందరిని మెప్పించినటువంటి సారా అర్జున్ తాజాగా పొన్నియన్ సెల్వన్ సినిమాలో ఐశ్వర్యరాయ్ చిన్నప్పటి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. ప్రస్తుతం 19 సంవత్సరాల వయసు కలిగి ఉన్నటువంటి ఈమె త్వరలోనే హీరోయిన్గా రాబోతున్నారని తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు ఈమె చైల్డ్ ఆర్టిస్టుగా నటిస్తూ దాదాపు పది కోట్ల రూపాయల వరకు ఆస్తులు పోగు చేశారని తెలుస్తోంది. ఇక ఈమె సినిమాలలో నటించాలి అంటే దాదాపు 30 నుంచి 40 లక్షల రూపాయలు వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. ఇలా ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటుందనే విషయం తెలియడంతో ఈ చిన్నారి చాలా కాస్ట్లీ అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి