
అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో జవాన్ సినిమా ప్రమోషన్స్ ను షారుక్ ఖాన్ పట్టించుకోకున్నప్పటికీ ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపుగా రూ .60 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది.ఈ సినిమా తమిళనాడులో కూడా కలెక్షన్ల వర్షం రాబడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా కేవలం డైరెక్టర్ అట్లీ వల్లే అన్నట్లుగా సమాచారం. ఈ సినిమా ఇప్పటివరకు టోటల్గా సాధించిన కలెక్షన్స్ విషయానికి వస్తే రూ.883 కోట్ల రూపాయల పైగా క్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విడుదలైన అన్ని చోట్ల కూడా సాలిడ్ కలెక్షన్స్ ని అందుకున్నది.
మొత్తం మీద బాక్సాఫీస్ వద్ద అన్నిచోట్ల దుమ్ముదులిపేస్తున్నాయి జవాన్ సినిమా.. అద్భుతమైన లాంగ్ రన్ ని ఎంజాయ్ చేస్తూ ప్రేక్షకులు ఉన్నారు. జవాన్ సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా జవాన్ చిత్ర బృందం పలు రకాల డ్యాన్సులతో అందరిని ఆకట్టుకున్నది. జవాన్ సినిమా విడుదలైన మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తో మంచి రెస్పాన్స్ లభించింది. రూ .350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో షారుఖ్ అభిమానులు చాలా సంబరపడుతున్నారు. ఈ ఏడాది షారుక్ ఖాన్ వల్లే బాలీవుడ్ మరొకసారి వార్తలలో నిలుస్తోంది.