
అర్జున్ రెడ్డి తర్వాత షాలిని పాండేకి అన్ని భాషల్లో వరుస అవకాశాలు వచ్చాయి. ఆ తరువాత ఈ భామ తెలుగులో 118 చిత్రంలో, ఇద్దరిలోకం ఒకటే మూవీలో షాలిని నటించింది. ప్రస్తుతం షాలిని పాండే హిందీలో రణ్వీర్ సింగ్ సరసన 'జయేష్ భాయ్ జోర్దార్' అనే చిత్రంలో నటిస్తోంది.అర్జున్ రెడ్డి చిత్రంలో కాస్త బొద్దుగా కనిపించిన షాలిని ఇటీవల తన లుక్ పై ఫోకస్ పెట్టింది. బరువు తగ్గి బాగా నాజూగ్గా తయారైయింది.. ప్రస్తుతం షాలిని లుక్ కుర్రాళ్లని ఆకర్షించే విధంగా స్టన్నింగ్ అనిపిస్తోంది.
తాజాగా షాలిని పాండే ఘాటైనా బికినీ అందాలతో . తన పెట్ తో కలసి స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడుతూ, క్యూట్ గా ఆడుకుంటూ ఇస్తున్న ఫోజులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఇటీవల షాలిని సోషల్ మీడియాలో ఎక్కువగా గ్లామర్ పిక్స్ పోస్ట్ చేస్తోంది. అర్జున్ రెడ్డి మూవీ భారీ హిట్ గా నిలిచినా కూడా ఆమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు అయితే రాలేదు. దీనితో షాలిని తన గ్లామర్ తో అవకాశాలు అందుకోవాలని చూస్తుంది.