
ఇటీవల కాలంలో దృశ్యం, సింగం, కే జి ఎఫ్, చంద్రముఖి ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ కూడా సీక్వెల్ సినిమాలు ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటూ ఉన్నాయి అని చెప్పాలి. దృశ్యం సినిమా తెలుగుతోపాటు తమిళ్ హిందీ భాషల్లో కూడా మూడు సీక్వల్స్ వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. సింగం సిరీస్ లోను మూడు సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు సింగం ఫోర్ ను రెడీ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. హారర్ సినిమాలకు కొత్త దారి చూపిన దర్శకుడు పీ వాసు సూపర్ స్టార్ రజనీకాంత్ తో చేసిన చంద్రముఖి సినిమాకి దాదాపు 17 ఏళ్ల తర్వాత ఇప్పుడు సీక్వెల్ చేస్తున్నాడు.
అంతే కాదు ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫంక్షన్ లోనే చంద్రముఖి త్రీ కూడా ఉంటుందని ప్రకటించడంతో అభిమానుల్లో అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి అని చెప్పాలి. ఇలా కొత్త కథలను ఎంచుకోవడం కంటే పాత కథల్లోనే కొత్తదనాన్ని చూపించి సూపర్ హిట్ కొట్టాలని అందరూ దర్శకులు కూడా భావిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇలా ప్రతి ఒక్క దర్శకుడు కూడా సీక్వెల్ వెంటపడుతున్నాడు. ఎందుకంటే సీక్వల్ అంటే మినిమం గ్యారంటీ సినిమా అని.. నిర్మాతలు కూడా భావిస్తూ ఉండడంతో ఇక సీక్వల్ అంటే చాలు నిర్మాతలు కూడా భారీగా డబ్బు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.