
ఇక తాజాగా తన పాత అనుభవాన్ని ఆమె గుర్తు చేసుకోనున్నారు ఓ మీడియా వేదికగా. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఓ సన్నివేశంలో నటించాక వాంతులు చేసుకున్నట్లు ఈ సందర్బంగా తెలిపారు. సహ నటుడి పెదాలు తాకగానే కడుపులో వికారం పుట్టి వాంతులు అయ్యాయట పాపం ఈ ముద్దుగుమ్మకు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. “ఆరోజుల్లో కాంట్రాక్టులు లాంటివి ఏవీ లేవు. నేను తొలి నుంచి నేను ముద్దు సన్నివేశాలకు దూరంగానే ఉన్నాను. కానీ నేను పరిశ్రమకి వచ్చిన కొత్తలో జరిగిన సంఘటన ఇప్పటికీ గుర్తుంది. ఓ సన్నివేశంలో నటుడి పెదాలు పొరపాటున నా పెదాలకు తగిలాయి. అది సినిమాలో సీన్ కాదు. అతను కావాలని కూడా చేయలేదు పాపం. పొరపాటున అలా జరిగింది. దీంతో ఒక్కసారిగా కడుపులో తిప్పేసింది. వికారంతో వాంతులు కూడా అయ్యాయి.” అని చెప్పుకొచ్చింది.
అంతేకాకుండా ఆమె తన ఇంటికి వెళ్ళి తన నోటిని ఒకటికి వందసార్లు కడుక్కుందట పాపం. ఆ సంఘటన జరిగిన తర్వాత సదరు హీరో తనకి క్షమాపణలు కూడా చెప్పారని చెప్పుకొచ్చింది. అయితే ఆ సినిమా పేరు ఏంటి? అతను ఏ హీరో? ఎప్పుడు జరిగింది? అనే వివరాలు మాత్రం ఆమె గోప్యంగా వుంచడం కొసమెరుపు. ఇటీవలి కాలంలో రవీనా టాండన్ పాత సినిమా షూటింగ్ ల్లో భాగంగా ఆన్ సెట్స్ లో ఎదురైన అనుభవాల గురించి ఒక్కొక్కటిగా చెప్పుకొస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఓ సినిమా పాట చిత్రీకరణలో భాగంగా వర్షంలో షూట్ చేస్తున్నప్పుడు ఆమె ఎలాంటి అసౌకర్యానికి గురయ్యారో రివీల్ చేసారు.