గత కొన్ని సంవత్సరాలుగా ఏ ఇండస్ట్రీలో నైనా సరే స్టార్ హీరోల చిత్రాలు చిన్న హీరోల చిత్రాలు అని తేడా లేకుండా నటీనటుల నటన బాగుంటే ఆ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటోంది. అలా ఇప్పటివరకు ఎన్నో సినిమాలు విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి పలువురు స్టార్ హీరోల చిత్రాలు కూడా డిజాస్టర్ గా మిగిలిన సందర్భాలు ఉన్నాయి. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ సాధించిన ఓవర్సీస్ చిత్రాల గురించి ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.


మొదట ఏడాదిలో ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా 50 కోట్ల రూపాయల వరకు రాబట్టింది. ఇక రెండవ స్థానంలో చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా 27.5 కోట్ల రూపాయలను రాబట్టింది. మూడవ స్థానంలో హీరో ధనుష్ నటించిన సార్ మూవీ 25 కోట్ల రూపాయలను రాబట్టింది. ఇక తర్వాత నాలుగవ స్థానంలో న్యాచురల్ స్టార్ నాని నటించిన పాన్ ఇండియా మొదటి చిత్రం దసరా ఈ సినిమా 22.45 కోట్ల రూపాయలు రాబట్టింది.

ఐదవ స్థానంలో విజయ్ దేవరకొండ సమంత కలిసి నటించిన ఖుషి మూవీ 19 కోట్లు రాబట్టింది. అనుష్క, నవీన్ పోలిశెట్టి కాంబినేషన్లో వచ్చిన మిస్ పోలిశెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా 17.5 కోట్లు రాబట్టింది. పవన్ కళ్యాణ్ సాయి ధరంతేజ్ నటించిన మల్టీస్టారర్ మూవీ బ్రో 16.4 కోట్లు రాబట్టింది. సాయి ధరంతేజ్ నటించిన మరొక చిత్రం విరూపాక్ష 13.9 కోట్ల రూపాయలను రాబట్టింది. తొమ్మిదవ స్థానంలో బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా 12.76 కోట్ల రూపాయలను రాబట్టింది. చివరిగా పదవ స్థానంలో  శ్రీ విష్ణు నటించిన సామజవరగమన సినిమా ఉన్నది. ఈ సినిమా 10.5 కోట్ల రూపాయలను రాబట్టింది. మరి రాబోయే రోజుల్లో మరిన్ని చిత్రాలు ఈ లిస్టులోకి చేరుతాయేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: