సీనియర్ స్టార్ డైరెక్టర్ కమర్షియల్ సినిమాలు తీయడంలో దిట్ట అయిన వీవీ వినాయక్ ఒకప్పుడు నెంబర్ వన్ డైరెక్టర్ గా చక్రం తిప్పారు. ఆయన దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ అదుర్స్ కేవలం ఎన్టీఆర్ అభిమానులనే కాదు సాధారణ ప్రేక్షకులని కూడా చాలా బాగా మెప్పించింది. ఈ సినిమా మళ్లీ విడుదలకు సిద్ధంగా ఉంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ 23 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమా విడుదల కానుంది.ఇక నవంబర్ 18, 2023న, అదుర్స్ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో మళ్లీ విడుదల కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై వల్లభనేని వంశీ ఇంకా కొడాలి నాని నిర్మించిన ఈ చిత్రంలో నయనతార, షీలా హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.తారక్ అదుర్స్‌లో తన ద్విపాత్రాభినయంతో ప్రేక్షకులను ఇంకా విమర్శకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు.


13 ఏళ్ల తర్వాత మళ్లీ విడుదల కానున్న ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మళ్ళీ ఎలాంటి రెస్పాన్స్‌ వస్తుందో చూడాలి. ఈ సినిమా కోసం కేవలం తారక్ అభిమానులే కాదు వేరే హీరో అభిమానులు కూడా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా లోని సీన్లు ఇంకా మీమ్స్ రూపంలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.ఇక మరోవైపు, ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తన రాబోయే చిత్రం దేవర కోసం పని చేస్తున్నాడు, ఇందులో ఆయన బాలీవుడ్ నటి జాన్వీ కపూర్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ 'దేవర' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఈ సినిమా పాన్  ఇండియా లెవెల్ లో సరికొత్త కథతో తెరకెక్కుతుంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ తిరిగి ఆర్ ఆర్ ఆర్ వంటి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటాడని ఎన్టీఆర్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి చూడాలి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: