ఇక మరికొన్ని రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా అటు చిత్రబృందం మాత్రం ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది అని చెప్పాలి. సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సినిమాలో ముందుగా రవితేజను హీరోగా తీసుకోవాలని అనుకోలేదట డైరెక్టర్ వంశీ. ముందుగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అయితే ఈ సినిమాలో హీరో పాత్రకి సరిగ్గా సెట్ అవుతాడని అనుకున్నాడట. ఈ క్రమంలోనే ముందుగా ఈ యంగ్ హీరో దగ్గరికి వెళ్లి సినిమా కథను కూడా వినిపించాడట. కానీ అతనికి అప్పటికి నాలుగు సినిమాలు లైనప్ లో ఉండడంతో సినిమా లేట్ అవుతుందని అనుకున్నాడట డైరెక్టర్ వంశీ.
దీంతో వేరే హీరోతో సినిమా చేస్తానని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు చెబితే అతను కూడా ఓకే చెప్పాడట. ఇక తర్వాత రవితేజకు కథ వినిపించడం ఆయన ఓకే చేయడం.. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రారంభం చకచక జరిగిపోయింది అని డైరెక్టర్ చెప్పుకొచ్చారు అయితే టైగర్ నాగేశ్వరరావు సినిమా చేయాలనుకున్నప్పుడు ఎంతో కాలం పాటు రీసెర్చ్ చేశాను అంటూ ఆయన తెలిపారు. కాగా అక్టోబర్ 19వ తేదీన పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గతంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ స్టువర్టుపురం దొంగ అని టైగర్ నాగేశ్వరరావు జీవిత కథను ప్రకటించినప్పటికీ ఈ సినిమా ఆగిపోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి