తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా.. స్టార్ డైరెక్టర్లలో ఒకడిగా కొనసాగుతూ ఉన్నాడు బోయపాటి శ్రీను. ఏ హీరోతో సినిమా తీసిన ఆ హీరోని ఎంతో పవర్ఫుల్ గా చూపించడంలో బోయపాటి దిట్ట అని చెప్పాలి. ఈ క్రమంలోనే అదిరిపోయే యాక్షన్స్ సన్నివేశాలతో, ఆకట్టుకునే పంచ్ డైలాగులతో ప్రేక్షకులు అందరిని కూడా అలరిస్తూ ఉంటాడు బోయపాటి. అయితే ఇటీవల ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో స్కంద అనే సినిమా తీసాడు. ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.


 ఇంటర్వ్యూలో భాగంగా ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమంలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా కొనసాగుతున్న తమన్ గురించి బోయపాటి చేసిన కామెంట్స్ కాస్త సంచలనంగా మారిపోయాయి అని చెప్పాలి.  బోయపాటి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖండ సినిమాకి సంగీతం అందించారు థమన్. అయితే తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అటు అఖండ సినిమాకి ప్రాణం పోసింది అంటూ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. కానీ బోయపాటి మాత్రం ఈ విషయాన్ని అస్సలు అంగీకరించలేదు. అఖండ సినిమాకి సంగీతం లేకపోయినా కూడా హిట్ అయిపోతుందని.. అంత దమ్ము సినిమాలో ఉందని తమన్ మ్యూజిక్ ని తీసిపారేసినట్లు మాట్లాడాడు బోయపాటి. స్కంద మూవీకి తమన్ ఇచ్చిన మ్యూజిక్ అస్సలు బాలేదు  అందుకే మూవీ విడుదలయ్యాక తమన్ తో మాట్లాడలేదు అని బోయపాటి చెప్పడం సంచలనంగా మారింది.



 అయితే బోయపాటి కామెంట్స్ తో తమన్ హార్ట్ అయ్యాడు అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే బోయపాటికి కౌంటర్ అన్నట్లుగా మెన్షన్ చేయలేదు కానీ ఇటీవల సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ మాత్రం వైరల్ గా మారిపోయింది. ఐ డోంట్ కేర్ అంటూ ఒక కౌంటర్ వేస్తూ పోస్ట్ పెట్టాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. అయితే ఇది తన లేటెస్ట్ మూవీ అయినా భగవంతు కేసరిలో డైలాగ్ అయినప్పటికీ బోయపాటికి తమన్ ఇచ్చిన కౌంటర్ అని ఎంతో మంది అనుకుంటున్నారు  ఏది ఏమైనా తమన్ ఎంతో కష్టపడి మ్యూజిక్ అందించి సినిమాకు ప్రాణం పోస్తే.. బోయపాటి తమన్ మ్యూజిక్ ను కించపరుస్తూ తీసిపారేయడం మాత్రం ప్రేక్షకులకు కూడా నచ్చడం లేదు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: