తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించిన ముద్దుగుమ్మలలో కాజల్ అగర్వాల్ ఒకరు. లక్ష్మీ కళ్యాణం మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత చందమామ మూవీ తో సూపర్ హిట్ ను అందుకుంది. ఇక మగధీర మూవీ తో ఇండస్ట్రీ హిట్ ను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ స్థానానికి ఎదిగి పోయింది. ఇక ఈ మూవీ తో తెలుగు లో టాప్ హీరోయిన్ స్నానానికి ఎదిగిపోయిన ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత చాలా సంవత్సరాల పాటు తెలుగు లో టాప్ హీరోయిన్ గానే కెరియర్ ను కొనసాగించింది.

అలా తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజీ సినిమా అవకాశాలతో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న సమయం లోనే ఈ ముద్దుగుమ్మ గౌతమ్ అనే వ్యక్తిని పెళ్లాడింది. ఆ తర్వాత ఒక మగ బిడ్డకు జన్మను కూడా ఇచ్చింది. ఇలా పెళ్లి ఆ తర్వాత ఒక బిడ్డకు జన్మనివ్వడం ఇలా కొన్ని కారణాల వల్ల ఈ ముద్దు గుమ్మ కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉంది. ఆ సమయంలో కాజల్ క్రేజ్ కూడా తెలుగు లో కాస్త పడిపోయింది. ఇకపోతే తాజాగా కాజల్ ... బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన భగవంత్ కేసరి సినిమాలో హీరోయిన్ గా నటించింది.

ఇప్పటివరకు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే ఈ మూవీ కనుక సక్సెస్ ను సాధించినట్లు అయితే మళ్లీ కాజల్ కి సూపర్ తెలుగులో వచ్చే అవకాశాలు ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు. మరి కాజల్ ఈ మూవీ తో ఏ రేంజ్ క్రేజ్ ను తెచ్చుకుంటుందో చూడాలి. భగవంత్ కేసరి మూవీ ని అక్టోబర్ 19 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: