ప్రతి సంవత్సరం చాలా మంది దర్శకులు తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఎంట్రీ ఇచ్చే వారిలో చాలా కొద్ది మంది మాత్రమే దర్శకత్వం వహించిన మొదటి మూవీ తోనే మంచి సక్సెస్ ను అందుకొని ముంచు గుర్తింపును అందుకుంటుంటారు. అలా దర్శకత్వం వహించిన మొదటి మూవీ తోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న అతి కొద్ది మంది దర్శకులలో శ్రీకాంత్ అడ్డాల ఒకరు. ఈయన చాలా సంవత్సరాల క్రితం విడుదల అయినటువంటి కొత్త బంగారు లోకం సినిమాతో దర్శకుడుగా తన కెరియర్ ను మొదలు పెట్టాడు.

మూవీ సూపర్ సక్సెస్ ను అందుకుంది. దానితో ఈ దర్శకుడికి మంచి గుర్తింపు కూడా లభించింది. ఇక ఆ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకొని ఈయన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే మరో మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కూడా మంచి విజయం సాధించడంతో ఈ దర్శకుడి క్రేజ్ తెలుగులో అమాంతం పెరిగిపోయింది. ఇక ఆ తర్వాత నుండి ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడుతూ రావడంతో ఈయన కెరియర్ గ్రాఫ్ కూడా చాలా వరకు పడిపోయింది.

అలాంటి సమయం లోనే ఈ దర్శకుడు "పెద్దకాపు 1" అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తర్వాత "పెద్దకాపు 2" అనే మూవీ ఉండబోతున్నట్లు కూడా ప్రకటించాడు. ఇకపోతే మంచి అంచనాల నడుమ విడుదల అయిన "పెద్దకాపు పార్ట్ 1" మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర గోరపరాజయాన్ని ఎదుర్కొంది. దీనితో "పెద్దకాపు పార్ట్ 2" సినిమా ఉండే అవకాశాలు చాలా వరకు లేనట్లే అని తెలుస్తోంది. మరి ఈయన "పెదకాపు పార్ట్ 2" మూవీ ని తెరకెక్కిస్తాడా ..? లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: