ఇపుడు ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 గురించి చర్చలు నడుస్తున్నాయి. ఇక రైతు బిడ్డగా బిగ్‌బాస్ ఇంట్లోకి అడుగు పెట్టిన పల్లవి ప్రశాంత్ తనదైన ఆటతీరుతో జనాలను మెప్పిస్తున్నాడు. ఓ కామన్ మ్యాన్ బిగ్ బాస్ హౌజ్ లో అడుగుపెట్టడం ఇదే తొలిసారి కావడం కొసమెరుపు. తనదైన రీతిలో గేమ్ ఆడుతూ ప్రేక్షకుల మదిని గెలుచుకుంటున్నాడు. అదే ఒకెత్తు అనుకుంటే, మొదటి క్యాప్టెన్ గా పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం రికార్డ్ బద్దలు కొట్టాడనే చెప్పుకోవాలి. ఇదే క్రమంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన బోలే షావలి.. పల్లవి ప్రశాంత్ గురించి ఓ విషయం లీక్ చేశాడు.
అవును, అతను ఏకంగా బిగ్ బాస్ హౌజ్ లో పల్లవి ప్రశాంత్ కు వచ్చిన ఆఫర్ గురించి ప్రస్తావించడం కొసమెరుపు. దాంతో ఇప్పుడు ఆ న్యూస్ వైరల్ గా మారింది. బిగ్‌బాస్ ఇంట్లోకి అతి తక్కువ రెమ్యూనరేషన్ తో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్... 6వ వారంలో కూడా దుసుకుపోతున్నాడు. కేవలం వారానికి లక్ష రూపాయలు తీసుకుంటూ బిగ్ బాస్ హౌజ్ లో తనదైన స్టైల్ లో ప్రేక్షకులకు ఎంటర్ టైన్మెంట్ ఇస్తున్నాడు. ఇక ఈ విషయం పక్కన పెడితే.. మొదట్లో ఆయన్ని రైతుబిడ్డ ట్యాగ్ యూజ్ చేస్తున్నారు అని ఇంటి సభ్యులు మొత్తం ఫైర్ అయ్యారు.
ముఖ్యంగా నాలుగో వారం నుంచి పల్లవి ప్రశాంత్ బాగా ఆడటం స్టార్ట్ చేశాడు. ఇక వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన బోలే షావాలి హౌజ్ లో వింతగా ప్రవర్తిస్తున్నాడు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. హౌజ్ మేట్స్ తో సంబంధం లేకుండా మాట్లాటం.. ఏదో చెప్పడం.. ఇలాంటి వికృత చేష్టలు చేస్తూ... ఆయన ట్రోలింగ్ గురువుతున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. ఈ నేపధ్యంలో బోలే షావాలి రైతు బిడ్డతో ఓ విషయం చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయం ఏంటంటే... రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఫేమస్ చూసి ఆయనకు ఓ సినిమా ఆఫర్ వచ్చిందట. అయితే ఆ విషయాన్ని బోలే షావలి.. పల్లవి ప్రశాంత్ కు చెప్పాడు. అయితే ఇది నిజమా లేక ప్రశాంత్ ని ఆటపట్టించడానికి చెప్పాడా అన్నది వేచి చూడాలి!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి