ఈ క్రమంలోనే ఒక రిపోర్టర్ నానిని ప్రశ్నిస్తూ మీ గత సినిమాలు జెర్సీ శ్యాం సింగరాయ్ వంటి సినిమాలు మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ బ్రేక్ ఈవెన్ కాలేదట, హాయ్ నాన్న లాంటి సినిమాలు ఎలా చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు నాని కూడా కాస్త ఇబ్బందిగానే ఇప్పుడు గత సినిమాల కలెక్షన్ల గురించి ప్రస్తావన ఎందుకు అయినా నా నిర్మాతలు కలెక్షన్ల విషయంలో సంతృప్తిగా ఉన్నారు అంటూ నాని సమాధానం చెప్పుకొచ్చారు. ఇలా ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా నానికి ఇలాంటి ప్రశ్న ఎదురు కావడంతో ఈ సినిమా నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా కలెక్షన్ల విషయంలో తాము చాలా సంతృప్తిగా ఉన్నాము అంటూ పోస్ట్ చేశారు. ఇకపోతే సినిమా ప్రమోషన్లలో భాగంగా నిర్మాత నాగ వంశీ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ వివాదం గురించి కాస్త ఘాటుగానే స్పందించారు. ఈ సందర్భంగా నాగ వంశీ మాట్లాడుతూ జెర్సీ రిజల్ట్ తో నేను సంతృప్తిగా ఉన్నాను.
ఆ సినిమా ఆర్ధిక లావాదేవీలతో మీకు ఏంటి సంబంధం. కలెక్షన్స్ గురించి సోషల్ మీడియాలో జరిగే ప్రచారం అంతా పూర్తిగా నిజం కాదు. అయినా మా వ్యాపారం గురించి అడిగితే మేము ఎందుకు చెబుతాం. మేము ఎందుకు దానిని రోడ్డు మీద పెట్టాలి. అలా పెట్టలేం కదా. ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు తెలిసి ప్రెస్ మీట్ లలో హీరోలను ఇబ్బంది పెట్టడం ఏంటి అంటూ ఈ సందర్భంగా నాగ వంశీ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి