ఇంతలా ఇంట్రడక్షన్ ఇచ్చాను అంటే ఆ హీరోయిన్ ఎవరో ఇప్పటివరకు మీకు అర్థం అయ్యే ఉంటుంది. ఆమె ఎవరో కాదు యంగ్ సెన్సేషన్ శ్రీ లీల. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి అనే సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత రవితేజతో ధమాకా చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో దర్శక నిర్మాతలు అందరూ కూడా ఈ అమ్మాయి టాలెంట్ కు ఫిదా అయిపోయి.. తమ సినిమాల్లో ఛాన్స్ లో ఇచ్చేస్తూ ఉన్నారు. దీంతో ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.
ఇక ఇటీవలే భగవంతు కేసరి సినిమాలోని బాలయ్య కూతురు పాత్రలో నటించి నటనతో మెప్పించింది. అయితే ఇప్పటివరకు ఏ సినిమాలో నటించిన రొమాంటిక్ సీన్ల విషయంలో ఇక చిట్టి పొట్టి బట్టలు ధరించడం విషయంలో కొన్ని లిమిట్స్ పెట్టుకుంది శ్రీలీలా. అయితే ఇటీవల కాలంలో మీడియా సినీ సెలబ్రిటీలను ఒక అడుగు ముందుకేసి ప్రశ్నలు అడుగుతుండడం చూస్తున్నాం. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో లిప్ లాక్ సీన్ చేయాల్సి వస్తే ఏ హీరోతో చేస్తారు అంటూ ప్రశ్నించగా.. ఆసక్తికర సమాధానం చెప్పింది ఈ హీరోయిన్. తన మొదటి ముద్దు తన భర్తకేనని.. స్పష్టం చేసింది. ఏ హీరోతో కూడా లిప్ లాక్ సీన్లలో నటించబోను అంటూ చెప్పేసింది శ్రీలీల.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి