ప్రముఖ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ హీరో గా మీడియం బడ్జెట్ తో రూపొందించిన చిత్రం డీ జే టిల్లు.. 2022లో విడుదలై భారీ వసూళ్లను రాబట్టింది ఈ సినిమా. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడమే కాదు సిద్దుకి మంచి పేరును కూడా అందించిందని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా సిద్దు జొన్నలగడ్డతోనే ప్రముఖ నిర్మాత నాగవంశీ , సాయి సౌజన్య టిల్లు స్క్వేర్ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా ఎంపిక అయింది .

ఈసారి రెట్టింపు వినోదం గ్యారెంటీ అంటూ సెప్టెంబర్ 15వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే.  అందుకు తగ్గట్టుగానే సిద్దు , అనుపమల రొమాంటిక్ పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు. కానీ కొన్ని కారణాలవల్ల సినిమా వాయిదా పడింది. ముఖ్యంగా ఈ సినిమా  హీరోయిన్ ల విషయంలోనే ఎన్నోసార్లు సినిమా విడుదల తేదీ వాయిదా పడుతూ వచ్చింది. కానీ ఎట్టకేలకు ఇప్పుడు మరొక రిలీజ్ డేట్ ను ప్రకటించింది చిత్ర బృందం.

వచ్చే ఏడాది మహాశివరాత్రి సందర్భంగా 2024 ఫిబ్రవరి 9వ తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని చిత్ర బృందం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ తేదీన సినిమాను రిలీజ్ చేస్తారా? కనీసం అప్పటికైనా మోక్షం వస్తుందా? అన్న అనుమానాలు మళ్లీ మొదలయ్యాయి. మరి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఆ రోజైనా వస్తుందా? లేదా? అన్నది చూడాలి.  ఇకపోతే ఈ సినిమాకి సంగీతాన్ని శ్రీ చరణ్ పాకాల, రామ్ మిర్యాల  అందిస్తూ ఉండగా.. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మరి ఏ మేరకు ఈ సినిమా విడుదలవుతుంది.. ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: