అయితే దాదాపు ఏడు వారాల నుంచి అటు నామినేషన్స్ లో ఉండకుండా తప్పించుకుని చరిత్ర సృష్టించిన సందీప్ మాస్టర్ ఎనిమిదవ వారంలో నామినేషన్ లోకి వచ్చి మొదటి నామినేషన్ లోనే ఇక హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడు. అయితే ఇలా హౌస్ నుంచి ఎవరైనా కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడు అంటే చాలు.. ఇక ఆ కంటెస్టెంట్ తో ఇంటర్వ్యూలు చేయడానికి అన్ని చానల్స్ కూడా ఆసక్తిని కనబరుస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే అతను బిగ్ బాస్ హౌస్ గురించి ఏదైనా మాట్లాడాడు అంటే చాలు.. అది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి.
ఈ క్రమంలోనే ఇటీవల ఎనిమిదో వారంలో ఎలిమినేట్ అయిన సందీప్ మాస్టర్.. బిగ్ బాస్ హౌస్ గురించి చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోయాయి. ఏకంగా బిగ్ బాస్ షో ని నడిపించేది శివాజీ అన్ననా అంటూ అడిగాడు యాంకర్ ప్రశ్నించగా.. బిగ్ బాస్ ని నడిపించేది శివన్న కాదు.. శివాజీ తాను ఇద్దరినీ కెప్టెన్ చేశాను అని స్టేట్మెంట్ వదిలాడు. ఆయన కెప్టెన్ చేయడం ఏంటి అనేది నా ప్రశ్న.. ఏడో వారంలో నేను ఒక్క మాల కూడా పడకుండా ఉన్నా. కెప్టెన్ కావాల్సిన నేను సింపతి రీజన్స్ చెప్పి కెప్టెన్సీ నుంచి నన్ను తప్పించారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు ఆట సందీప్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి