ఇక మరోపక్క కార్తీక్ సుబ్బరాజు డైరెషన్ లో తెరకెక్కిన జిగర్ తండా 2 కూడా మంచి బజ్ తో వస్తుంది. ఆల్రెడీ జిగర్ తండ సినిమా తెలుగులో గద్దలకొండ గనేష్ గా రీమేక్ అయ్యింది. అయితే ఆ టైం లో జిగర్ తండా ని తెలుగులో రిలీజ్ చేయలేదు. ఇక ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ టైటిల్ తో వస్తున్న జిగర్ తండ 2 సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజు టేకింగ్ కి తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు.
లారెన్స్, ఎస్.జె సూర్య ప్రధాన పాత్రలుగా వస్తున్న జిగర్ తండా 2 కూడా క్రేజీగా మూవీగా వస్తుంది. అయితే జపాన్ వర్సెస్ జిగర్ తండా 2 తెలుగులో కూడా ఈ సినిమాల మధ్య గట్టి ఫైట్ జరుగుతుంది. ఈ వీకెండ్ తెలుగు సినిమాలేవి లేకపోవడం వల్ల డబ్బింగ్ సినిమాలకే వదిలేసినట్టు అయ్యింది. మరి ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఎలా ఉంటుంది. ఏ సినిమా విజయ పతాకం ఎగరవేస్తుంది అన్నది చూడాలి. రెండు సినిమాల మీద మేకర్స్ చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నారు. తెలుగులోనే కాదు తమిళంలో కూడా ఈ సినిమాల మధ్య ఊహించని విధంగా ఫైట్ జరుగుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి