టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం కోసం మహేష్ బాబు అభిమానులంతా వేయి కళ్ళతో ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న కావడంతో ఈ మూవీ పై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.దాదాపు 12 ఏళ్ల తర్వాత వీరి ఇద్దరి కాంబినేషన్ లో మూవీ రానుంది. పైగా సూపర్ స్టార్ మహేష్ బాబు కంప్లీట్ మాస్ మసాలా అవతార్ లో కనిపించనున్నారు. ఈ మధ్య కాలంలో మహేష్ బాబు ఇంత ఊర మాస్ గా కనిపించలేదు. దాంతో మహేష్ ఫ్యాన్స్ గుంటూరు కారం సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే మేకర్స్ పోస్టర్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇక తాజాగా గుంటూరు కారం నుంచి ఫస్ట్ సింగిల్ ను కూడా రిలీజ్ చేశారు.ఇక ధమ్ మాసాల బిరియాని అంటూ సాంగ్ మాస్ సాంగ్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. 


ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించగా.. రామజోగయ్య శాస్త్రి ఈ పాటకి సాహిత్యం అందించారు. ఈ పాటని సంజిత్ హేగ్డ్ ఆలపించారు. ఈ సాంగ్ ఇప్పుడు ప్రేక్షకులను ఇంకా అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఆడియో రైట్స్ ని ఆదిత్య మ్యూజిక్ కొనుగోలు చేసింది.థియేటర్స్ లో ఖచ్చితంగా దుమ్మురేగడం ఖాయం అంటున్నారు అభిమానులు.గుంటూరు కారం మూవీలో మహేష్ బాబు సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.ఇంకా అలాగే మరో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి కూడా కనిపించనుంది. జనవరి 12 న సంక్రాంతి కానుకగా ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీకి సూర్యదేవర నాగవంశీ, చిన్నబాబు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీతో మహేష్ బాబు ఖచ్చితంగా మరో 200 కోట్ల బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు ఆయన అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: