సంక్రాంతి బరిలో దిగబోతున్న ఈ సినిమా ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది.ఈ సినిమా టీజర్ ఇటీవలే రిలీజ్ కాగా మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి ఈ రోజు దీపావళి కానుకగా మరొక పోస్టర్ రిలీజ్ చేసారు.. దివాళి పోస్టర్ తో ఫస్ట్ సింగిల్ గురించి అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ''రాంగ్ యూసేజ్'' అంటూ వెంకీ మామపై ఒక పార్టీ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు..
నవంబర్ 21న విడుదల చేస్తున్నట్టు తెలిపారు.. మరి ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.. కాగా వెంకటేష్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ స్థాయిలో నిర్మిస్తుండగా.. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కాగా ఈ సినిమాలో వెంకీకి జోడీగా శ్రద్ధ శ్రీనాథ్ న( Shraddha Srinath )టిస్తుండగా.. ఆండ్రియా, రుహనీ శర్మ కూడా కీ రోల్స్ పోషిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి