తెలుగు ఇండస్ట్రీలో తనకు చిరంజీవి అంటే చాలా ఇష్టమని రక్షిత్ శెట్టి చెప్పారు. అలాగే, జూనియర్ ఎన్టీఆర్ చేసే డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని అన్నారు. రానా కూడా తనకు ఫేవరెట్ అని చెప్పారు. ఇక, రష్మిక ఎప్పుడు గొప్పగా కలలు కనే వారని చెప్పారు.రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ హీరోహీరోయిన్లుగా నటించిన సప్తసారగాలు దాటి సైడ్-బీ చిత్రం రేపు (నవంబర్ 17) థియేటర్లలో రిలీజ్ కానుంది. సైడ్-ఏకు ఇది కొనసాగింపుగా వస్తోంది.రక్షిత్ శెట్టి, రష్మిక మందన్న 2016లో కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమా చేశారు. ఆ సమయంలో ఇద్దరూ ప్రేమించుకున్నారు. 2017లో ఎంగేజ్‍మెంట్ చేసుకున్నారు. అయితే, ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో 2018లో వీరు విడిపోయారు.అయితే, తాను విడిపోయినా ఇప్పటికీ రష్మికతో టచ్‍లోనే ఉన్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రక్షిత్ చెప్పారు. తాను, రష్మిక అప్పుడప్పుడు మెసేజ్‍లు చేసుకుంటామని తెలిపారు. తమ సినిమాల రిలీజ్ సమయంలో విషెస్ చెప్పుకుంటామని అన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి