టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన యానిమల్ సినిమా డిసెంబర్ ఒకటవ తేదీన చాలా గ్రాండ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో నటించిన హీరో రణబీర్ కపూర్ ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకునీ ఫ్యాన్ ఇండియా మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను క్రియేట్ చేసుకోవాలని బాలీవుడ్ ఫ్యాన్స్ కోరుకుంటూ ఉన్నాడు.ఇక తెలుగు హిందీలో అయితే ఈ సినిమాకు ఖచ్చితంగా మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. మిగతా భాషల్లో  టాక్ ను బట్టి సినిమా కలెక్షన్లు పెంచుకునే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా నిడివి గురించి చాలా రోజులుగా చాలా రకాల కథనాలు వెలువడుతున్నాయి. థియేటర్లలో ఈ సినిమా మూడు గంటలకు నిడివితో ఉండబోతున్నట్లు టాక్ రాగానే అందరూ కూడా ఎంతో ఆశ్చర్యపోయారు.ఇక మూడు గంటలు ఎక్కువ అని అందరూ మాట్లాడుకుంటున్న తరుణంలో సినిమాకు మూడు గంటల 21 నిమిషాలతో సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ వచ్చినట్లు చిత్ర యూనిట్ కూడా క్లారిటీ ఇచ్చింది. దీంతో ఆడియన్స్ ఇంకా మరింత ఆశ్చర్యపోయారు.


అయితే ఆ విషయంలో మాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం లేదని ఎందుకంటే ఈ సినిమాలో ప్రతి సీన్ కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది అని డైరెక్టర్ అన్నారు.అయితే ఈ రేంజ్ లో రన్ టైమ్ ఫిక్స్ అయ్యింది అంటే అసలు మొదట దర్శకుడు ఒకే చేసిన రన్ టైమ్ గురించి తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. ఫైనల్ అవుట్ ఫుట్ ప్రకారం సందీప్ రెడ్డి వంగా యానిమాల్ మూవీని 3.49 నిమిషాలకు కట్ చేశారట. పైగా ఈ సినిమాకు అతనే ఎడిటర్ కావడం విశేషం. దీంతో ప్రతీ సీన్ కూడా సినిమాకు అవసరమే అనేలా సందీప్ ఆలోచించారు అనిపిస్తుంది. ఇక యానిమల్ ఓటిటి వెర్షన్ అయితే 230 మినిట్స్ ఉంటుందని సమాచారం తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో విడుదలకు ముందే రణబీర్ రికార్డులు బద్దలు కొడుతున్నాడు. ముఖ్యంగా అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో బాలీవుడ్ మెయిన్ పిల్లర్స్ అయిన షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ పఠాన్, టైగర్ 3 సినిమాల రికార్డులను రణబీర్ బద్దలు కొట్టాడు. అలాగే తెలుగులో కూడా భారీ హిట్ కొట్టేలా ఉన్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మార్నింగ్ షోస్ కూడా గట్టిగా పడనున్నాయని సమాచారం తెలుస్తుంది. సో యావరేజ్ టాక్ వచ్చినా కూడా ఈ సినిమా రికార్డ్ ఓపెనింగ్స్ రాబట్టడం పక్కా..

మరింత సమాచారం తెలుసుకోండి: