ఇంకో రెండు రోజుల్లో యానిమల్ విధ్వంసం మొదలు కానుంది. ఈ మూవీ కోసం బాలీవుడ్ తోపాటు టాలీవుడ్ ప్రేక్షకులు కూడా వేయి కళ్ళతో ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే చిన్న హీరో విజయ్ దేవరకొండకి లైఫ్ ఇచ్చి ఓవర్ నైట్ స్టార్ హీరోగా మార్చిన టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చింది కాబట్టి ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి అర్జున్ రెడ్డి లాంటి మూవీతో సూపర్ సక్సెస్ అందుకున్న సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత ఇలా యానిమల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ పై అంచనాలను తారా స్థాయికి చేర్చాయి. ఈ క్రమంలో రీసెంట్ గా యానిమల్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.ఈ ఈవెంట్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు మెయిన్ గెస్ట్ గా హాజరయ్యారు. మహేష్ బాబుతో పాటు డైరెక్టర్ రాజమౌళి కూడా ఈ ఈవెంట్ హాజరయ్యారు. హైదరాబాద్ లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో ఈ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. అలాగే ఈ ఈవెంట్ కు పెద్దెత్తున సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు హాజరయ్యారు.


 అందరి చూపు మహేష్ వైపే ఉంది. ఇదేదో మహేష్ బాబు సినిమా ఈవెంట్ లా సందడి చేశారు ఫ్యాన్స్. ఈవెంట్ అంతా కూడా జై బాబు అంటూ స్లోగన్స్ పలుకుతూ రచ్చ చేశారు ఫ్యాన్స్. బాలీవుడ్ స్టార్స్ కూడా మహేష్ క్రేజ్ చూసి షాక్ అయ్యారు. మహేష్ సపోర్ట్ కి ఫిదా అయిపోయారు. మహేష్ ని పొగడ్తలతో ముంచేశారు. ఈ యానిమల్ ఈవెంట్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా క్యాజివాల్ లుక్ లో వచ్చారు.ఒక ప్లెయిన్ టీషర్ట్ , జీన్స్ వేసుకొని వచ్చి అందరిని డామినేట్ చేశాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. అయితే మహేష్ వేసుకున్న టీషర్ట్ సింపుల్ గానే ఉంది కానీ దాని ధర అయితే దిమ్మతిరిగే రేంజ్ లో ఉంది. గివేంచి బ్రాండ్ కు చెందిన ఈ టీషర్ట్ ధర ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ టీషర్ట్ ధర అక్షరాలా రూ. 47వేల రూపాయలు. ఇది చూడటానికి సింపుల్ గా ఉంది కానీ ధర మాత్రం మైండ్ బ్లాక్ చేస్తుంది అంటూ నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఈ యానిమల్ ఈవెంట్ కేవలం మహేష్ కోసం చేసినట్లుగా ఉంది. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు గూగుల్ ట్రెండ్స్ లో టాప్ లో నిలిచి రికార్డ్ క్రియేట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: