
ది ఫ్యామిలీ మెన్ సెకండ్ సీజన్ లో సమంత కూడా నటించింది ఈ సిరీస్ ని మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి నీరజ్ యాదవ్, శ్రేయ ధన్వంతరి పలువురు నటీనటులు సైతం ముఖ్యమైన పాత్రల నటించడం జరిగింది. ఈ వెబ్ సిరీస్ తనకు బాగా నచ్చిందని తెలిపారు. కాని సమంత ఇందులో కాస్త బోర్డ్ గా నటించిందని అందుకే చైతన్యకి సమంతకు మధ్య గొడవలు వచ్చి విడిపోయారని రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ విషయం గత కొన్నేళ్లుగా వైరల్ గా మారుతూనే ఉంది.
ఇకపోతే నాగచైతన్య ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే తండేల్ అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఇది వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు తెలియజేశారు శ్రీకాకుళం విజయనగరం జిల్లాలకు చెందిన 25 మంది మత్స్యకారుల జీవిత కథ ఆధారంగా తెరకెక్కించాలని తెలియజేశారు. 2018 నవంబర్లో పొరపాటున పాకిస్తాన్ సముద్ర తీరం అధికారులకు బందీలుగా చిక్కడం జరిగింది దీంతో ఆ మత్స్యకారులు దాదాపుగా ఏడాదిన్నర పాట అక్కడే బందీలుగా ఉంటారు.అలా వారి జైలు జీవితాన్ని అనుభవించిన వారి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇందులో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తూ ఉన్నది...