అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం తండేల్.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్  శరవేగంగా జరుగుతోంది ఇందులో హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తూ ఉండగా.. డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. భారీ బడ్జెట్ తో గీత ఆర్ట్స్ బ్యానర్-2 పైనా తెరకెక్కిస్తూ ఉన్నారు.అయితే ఈ సినిమా కంటే ముందుగా నాగచైతన్య నటించిన దూత సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో విడుదల కావడం జరిగింది. అయితే ఈ వెబ్ సిరీస్ ఈ రోజున స్ట్రిమింగ్ కావాల్సి ఉండగా నిన్నటి రోజునే ఎంట్రీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.


అమెజాన్ ప్రైమ్ అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. డిసెంబర్ ఒకటవ తేదీన కాకుండా ముందు రోజే కొద్దిసేపటికి క్రితమే ఈ వెబ్ సిరీస్ ని స్ట్రిమింగ్ అవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో మనం, థాంక్యూ వంటి సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ కాంబినేషన్లో ఈ వెబ్ సిరీస్ విడుదల చేయడం జరిగింది.. గతంలో కూడా విక్రమ్ కే కుమార్ 13B అనే చిత్రాన్ని కూడా తెరకెక్కించారు. ఆ కోరికను సైతం ఇప్పుడు దూత రూపంలో మరొకసారి తీర్చుకున్నట్లుగా తెలుస్తోంది.


 ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చిత్రంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మొట్టమొదటిసారిగా నాగచైతన్య ఇలాంటి హారర్ జోనర్ వైపుగా అడుగులు వేశారు. ఇందులో ప్రియా భవాని శంకర్, పార్వతి తిరువోరు, ప్రాచీ దేశాయి తదితరులు సైతం కీలకమైన పాత్రలు నటించారు నాగచైతన్య సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ ని పెడుతూ షో టైం ఇప్పుడు దూత డ్రాప్ అయ్యింది. స్మాల్ స్క్రీన్ పై బిగ్ స్క్రీన్ లాంటి ఫార్మాట్ అంటూ రాసుకురావడం జరిగింది. ఇలాంటి కథలు భాగం కావడం అందుకు తనకు చాలా ఆనందంగా ఉందంటూ ఇలాంటి స్పెషల్ పాత్రను తనకు ఇచ్చినందుకు డైరెక్టర్ విక్రమ్ కు అమెజాన్ ప్రైమ్ కు సైతం ధన్యవాదాలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: