పాన్ ఇండియా హీరో ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో మోస్ట్ అవైటెడ్ మూవీ గా తెరకెక్కిన 'సలార్' పార్ట్-1 సీజ్ ఫైర్ డిసెంబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై మొదటినుంచి భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్ తో అంచనాలను పెంచగా తాజాగా విడుదలైన ట్రైలర్ దాన్ని తారస్థాయికి చేర్చింది. సలార్ ట్రైలర్ ని గా యూట్యూబ్లో అన్ని భాషల్లో రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన కొద్ది గంటలకే అత్యధిక వ్యూస్, లైక్స్ తో సోషల్ మీడియాని షేక్ చేసింది. ఇక ట్రైలర్ తోనే డార్లింగ్ ఇండియన్ రికార్డ్స్ బద్దలు కొట్టేసాడు.

 సుమారు 24 గంటలుగా యూట్యూబ్ లో ప్రభాస్ మ్యానియానే నడిచింది. తెలుగుతోపాటు హిందీలోనూ ఈ ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. 24 గంటల్లో అన్ని భాషల్లో సలార్ ట్రైలర్ భారీ వ్యూస్ అందుకోవడం విశేషం. కాగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ అన్ని భాషలు కలిపి 24 గంటల్లో సలార్ ట్రైలర్ కి ఏకంగా 116 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇప్పటివరకు ఈ రేంజ్ వ్యూస్ మరే ట్రైలర్ కి రాలేదు. దాంతో అత్యధిక వ్యూస్ సాధించిన ఇండియన్ మూవీ ట్రైలర్ గా సలార్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. సలార్ కంటే ముందు 'కేజిఎఫ్ 2' ఈ రికార్డుని అందుకుంది.

 'కేజిఎఫ్ 2' మూవీకి 24 గంటల్లో అన్ని భాషల్లో కలిపి 106 మిగిలిన వ్యూస్ వచ్చాయి. ఇక తాజాగా సలార్ దాన్ని బ్రేక్ చేసి 24 గంటల్లో 116 మిలియన్ల వ్యూస్ అందుకుని ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ ట్రైలర్ ని తెలుగు వాళ్ళ కంటే హిందీ వల్లే ఎక్కువగా చూశారు. తెలుగులో ఈ ట్రైలర్ కి 33 మిలియన్ల వ్యూస్ వస్తే హిందీలో ఏకంగా 54 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం విశేషం. దాంతో బాలీవుడ్ లోనూ 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన ట్రైలర్ గా 'సలార్' సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. దీనికంటే ముందు ప్రభాస్ 'ఆదిపురుష్' 52.3 మిలియన్ల వ్యూస్ తో హిందీలో టాప్ లో ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: