అక్కినేని నాగచైతన్య తాజాగా 'దూత' వెబ్ సిరీస్‍తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు.. చైతూ నటించిన తొలి వెబ్ సిరీస్ ఇదే.సూపర్ నాచురల్ క్రైమ్ థ్రిల్లర్‌గా దూత వెబ్ సిరీస్‍ను రూపొందించారు దర్శకుడు విక్రమ్ కే కుమార్. మొత్తంగా 8 ఎపిసోడ్లు తెరకెక్కిన దూత వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో నవంబర్ 30 న స్ట్రీమింగ్‍కు వచ్చింది.దూత వెబ్ సిరీస్‍కు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది.. సిరీస్ ఎంతో ఉత్కంఠభరితంగా ఉండటంతో వీక్షకుల సంఖ్య బాగా పెరుగుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లోనూ దూత సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. దూత సిరీస్‍కు తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో అమెజాన్ ప్రైమ్ వీడియోలో దేశవ్యాప్తంగా ప్రస్తుతం దూత వెబ్ సిరీస్ ట్రెండింగ్ లిస్టులో టాప్‍కు వచ్చేసింది. దీంతో నాగచైతన్య కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. "ఇంతకంటే మంచి స్టార్ట్ ఉండదు. దూత.. ఇండియాలో నంబర్ 1. థాంక్యూ" అని చైతూ పోస్ట్ చేశారు. ప్రైమ్ వీడియో టాప్-10లో దూత నంబర్.1లో ఉన్న ఫొటోను కూడా పోస్ట్ చేశారు. ఈ సిరీస్ లో నాగచైతన్య యాక్టింగ్ అలాగే విక్రమ్ కే కుమార్ టేకింగ్, ఉత్కంఠభరితమైన కథనం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.దూత వెబ్ సిరీస్‍లో నాగ చైతన్యతో పాటు ప్రియా భవానీ శంకర్, పార్వతి తిరువత్తు, ప్రాచీ దేశాయ్, రఘు కుంచె, అనిశ్ కురువిళ్ల మరియు రవీంద్ర విజయ్ కీలకపాత్రలు పోషించారు. విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహించారు. శరత్ మరార్ ఈ సిరీస్ కి మరో నిర్మాతగా ఉన్నారు. ఈ సిరీస్‍కు ఇషాన్ చాబ్రా మ్యూజిక్ అందించారు.దూత వెబ్ సిరీస్‍కు దాదాపు రివ్యూలన్నీ పాజిటివ్‍గా రావడంతో ఈ సిరీస్‍కు మంచి ఆదరణ లభిస్తుంది

మరింత సమాచారం తెలుసుకోండి: