రక్షిత్ శెట్టి , రుక్మిణి వసంత్ జంటగా నటించిన లవ్ అండ్ ఎమోషనల్ మూవీ సప్త సాగరాలు దాటి సైడ్ బి..నవంబర్ 17న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ నెల రోజుల కాకముందే ఓటీటీలోకి వచ్చేస్తుంది.ఈ సినిమా కన్నడంతో పాటు తెలుగు, తమిళం మరియు మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. సప్తసాగరాలు దాటి సైడ్ ఏ కమర్షియల్ హిట్‌గా నిలవగా సీక్వెల్ గా వచ్చిన సైడ్ బి మాత్రం ఫ్లాపయింది. సీక్వెల్‌పై ఉన్న అంచనాలకు తగ్గట్లుగా కథ మరియు కథనాలు లేకపోవడంతో సప్త సాగరాలు దాటి సైడ్ బీ పరాజయం పాలయ్యింది. ఈ సినిమా డిసెంబర్ 15న ఓటీటీలో విడుదల కానుంది. హీరో రక్షిత్ శెట్టినే నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు హేమంత్ రావు  రచన, దర్శకత్వం చేశారు. సప్తసాగరాలు దాటి సైడ్ ఏ విడుదలైన రెండు నెలల్లోనే సైడ్ బీ కూడా విడుదలైంది.ఔట్ అండ్ ఔట్ ఫుల్ ఎమోషనల్ గా సాగే ఈ సినిమా స్లోగా రన్ అయినా అందులోని క్యారెక్టర్స్,ఫీల్ చాలాకాలం గుర్తుండిపోయేలా చిత్రంగా తెరకెక్కింది. మొదటి బాగం సైడ్ ఏలో హీరో ఓ బడా కంపెనీలో కారు డ్రైవర్ గా పని చేస్తూ పాటలు పాడే తన ప్రేయసితో సంతోషంగా ఉంటూ, పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటుంటాడు. ఈ క్రమంలో ఓనర్ చేసిన యాక్షిడెంట్ ను తనపై వేసుకుని జైలుకు వెళ్లడం, తీరా లోపలికి వెళ్లాక బెయిల్ పై బయటకు తీసుకువస్తానన్న యజమాని గుండెపోటుతో చనిపోవడంతో హీరో జైలులోనే ఉండాల్సి రావడం, మధ్యలో గుండెలకు హత్తుకునే మాటలు మరియు పాటలతో కథనం ఆధ్యంతం ఎంతో ఇట్రెస్టింగ్ గా సాగుతుండగా పార్ట్1 ముగించారు.ఇక రెండో భాగం సైడ్ బీ లో హీరో బయటకు రావడం, మరొకరిని పెళ్లి చేసుకున్న ప్రేయసి గురించి ఆలోచిస్తూ తీవ్ర మానసిక వేదన చెందుతూ ఆమె సంతోషంగా ఉందా లేదా అని అనుక్షణం అమెనే గమనించడం వంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో సినిమా సాగుతుంది.అలాగే తనను జైలుకు పంపించిన వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అన్నదే సీక్వెల్ కథ ఇప్పటికే మొదటి పార్ట్ సైడ్ ఏ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుండగా, ఇప్పుడు సప్త సాగరాలు సైడ్ బీ కూడా అమెజాన్ ప్రైమ్ లో డిసెంబర్ 15న స్ట్రీమింగ్ కానుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: