టాలీవుడ్ లో ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మాన్ గా పేరు తెచ్చుకొని వరుస విజయాలు అందుకున్న రాజశేఖర్  గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టిన ఆయన నితిన్ లేటెస్ట్ మూవీ 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్' లో కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాతోనే తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెడుతూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను అలరించబోతున్నారు. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నితిన్ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. డిసెంబర్ 8న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

కాగా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా డిసెంబర్ 4న చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్ కి మూవీ టీమ్ అంతా హాజరయ్యారు. ఇందులో భాగంగా ఈవెంట్లో పాల్గొన్న సీనియర్ హీరో రాజశేఖర్ పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. రీసెంట్ గా ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ ట్రైలర్ ఆడియన్స్ ని ఆకట్టుకున్న విషయం తెలిసిందే కదా. ముఖ్యంగా ట్రైలర్ చివరలో రాజశేఖర్ చెప్పిన 'నాకు జీవితం, జీవిత రెండు ఒకటే' అనే డైలాగ్ ఎంత వైరల్ అయిందో తెలిసిందే. నిజ జీవితంలో కూడా రాజశేఖర్ అలాగే ఉంటారని చాలామంది అనుకుంటారు. ఇదే విషయంపై రాజశేఖర్ స్పందిస్తూ.." 

సినిమాలో నాకు జీవిత, జీవితం రెండు ఒకటే అనే డైలాగ్ వక్కంతం వంశీ గారు రాశారు. ఆయనకు ఆ ఐడియా ఎలా వచ్చిందో తెలియదు. కానీ అది బాగా వైరల్ అయింది. జీవిత ఏం చెప్తే అది నేను చేస్తాను అనే ఉద్దేశంతో వంశీ ఈ డైలాగ్ రాసినట్టున్నాడు. కానీ నిజానికి నేను చెప్పిందే జీవిత వింటుంది. తను చాలా మంచిది. తిరిగి ఒక్క మాట కూడా అనదు. బయట మాత్రం జీవిత చెప్తేనే నేను వింటాను అని అనుకుంటున్నారు. నిజానికి జీవిత చెప్పింది కూడా నేను వింటాను. ఎందుకంటే ఆమె ఏం చెప్పినా నా మంచి కోసమే కదా" అంటూ తన భార్య జీవిత గురించి పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు రాజశేఖర్. 


మరింత సమాచారం తెలుసుకోండి: