హాలీవుడ్ సినిమాల్లో ఉండే యాక్షన్ ఎపిసోడ్ల క్వాలిటీ మన ఇండియన్ సినిమాల్లో చాలా తక్కువగానే కనిపిస్తూ ఉంటుంది.అయితే ఆ రేంజ్ విజువల్స్ ను తెలుగు స్టార్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి లాంటి తక్కువ మంది డైరక్టర్లే మాత్రమే చూపించారు.అయితే టాప్ గన్ మేవరిక్, మిషన్ ఇంపాజిబుల్ రేంజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ను రాజమౌళి కూడా ఇప్పటి దాకా ప్రయత్నించలేదు. అయితే బాలీవుడ్ టాప్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ ఆ లోటును భర్తీ చేయడానికి రెడీ అయ్యాడు.టాప్ గన్ మేవరిక్ రేంజ్ సినిమా చెయ్యాలంటే ట్రామ్ క్రూజ్ లాంటి యాక్షన్ హీరో ఉండాలిగా.. అందుకే ఇండియన్ టామ్ క్రూజ్ హృతిక్ రోషన్ తో చేశారు సిద్ధార్థ్ ఆనంద్. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో సూపర్ హిట్ సినిమాలు బ్యాంగ్ బ్యాంగ్, వార్ వచ్చి రికార్డులు క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు ఫైటర్ సినిమాతో మరోసారి సిద్దార్థ్ ఆనంద్, హృతిక్ రోషన్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.2024 జనవరి 25వ తేదీ విడుదల కానున్న ఫైటర్ మూవీకి సంబంధించిన టీజర్ ను మేకర్స్ శుక్రవారం రిలీజ్ చేశారు.ఈ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే గూస్ బంప్స్ వచ్చాయి. ఈ టీజర్ లో ప్రతి షాట్, ప్రతి ఫ్రేమ్ స్టన్నింగ్ గా ఉంది. ఇక దీపికా పదుకొణె, అనిల్ కపూర్ లుక్స్ ను కూడా ఫైటర్ టీజర్ లో మేకర్స్ రివీల్ చేశారు.


భారీ సెట్స్, ఊహకందని యాక్షన్ బ్లాక్స్ తో ఫైటర్ టీజర్ నిజంగా అదిరిపోయింది.ఇక ఏరియల్ షాట్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎండ్ షాట్ లో హృతిక్ రోషన్ చోపర్ దిగుతున్న టైమ్ లో వచ్చిన కట్ షాట్స్ మెస్మెరైజ్ చేసేశాయి. ఓవరాల్ గా ఒక హాలీవుడ్ రేంజ్ హిందీ సినిమాను పాన్ ఇండియా ఆడియన్స్ కు చూపించబోతున్నారు సిద్ధార్థ్ ఆనంద్. ఇలాంటి డైరెక్టర్ ఉన్నందుకు బాలీవుడ్ నిజంగా పుణ్యం చేసుకోవాలి.ఇక ఈ మూవీలో హృతిక్ రోషన్ స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియా (పాటీ)గా కనిపించనుండగా.. స్క్వాడ్రన్ లీడర్‌ మిన్నిగా (దీపికా పదుకొణె).. గ్రూప్ కెప్టెన్ రాకేష్ జై సింగ్ పాత్రలో సీనియర్ హీరో అనిల్‌ కపూర్‌ కనిపించనున్నారు.ఈ సినిమాని వయాకామ్‌ 18 స్టూడియోస్‌-మార్‌ఫ్లిక్స్‌ పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.పఠాన్ సినిమాతో బాలీవుడ్ కి 1000 కోట్లు ఇచ్చి సేవ్ చేసిన సిద్ధార్థ్ ఆనంద్ ఖచ్చితంగా రాజమౌళికి పెద్ద పోటీ ఇస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: