అందాల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకం గా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అక్కర్లేదు . ఈమె అందాల రాక్షసి అనే సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయ్యి మంచి గుర్తింపును సంపాదించుకుంది . ఇక ఈ మూవీ లో ఈ నటి తన నటనతో ప్రేక్షకు లను ఎంత గానో ఆకట్టుకోవడం తో ఈ సినిమా తర్వాత వరుసగా లావణ్య కు తెలుగు లో అవకాశాలు దక్కాయి. అందులో భాగం గా ఇప్పటికే ఎన్నో సినిమా లలో నటించిన ఈ బ్యూటీ తన నటన తో మాత్రమే కాకుండా ఎన్నో సినిమా లలో తన అంద చందాలను కూడా ఆరబోసి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 

ఇకపోతే కొంత కాలం క్రితమే ఈ నటి ... మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను ప్రేమించి పెళ్లాడింది. చాలా రోజులుగా ప్రేమ లో ఉన్న వీరు వీరి పెద్దలను ఒప్పించి గ్రాండ్ గా కొన్ని రోజుల క్రితమే పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరి దాంపత్య జీవితం చాలా సంతోషం గా ముందుకు సాగుతుంది. ఇకపోతే సినిమా లతో ప్రేక్షకు లను ఎప్పటి కప్పుడు పలకరిస్తున్న లావణ్య సోషల్ మీడియా లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అనేక విషయా లను తన అభిమానులతో పంచుకోవడం మాత్రమే కాకుండా తన ఫోటో లను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. 

అందులో భాగంగా తాజాగా లావణ్య అదిరిపోయే లుక్ లో ఉన్న ఎరుపు కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన ఎరుపు కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి చాలా క్యూట్ లక్స్ తో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం లావణ్య కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: