పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతోన్న మూవీ సలార్. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా పార్ట్ 1 డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా చాలా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.ఈ మూవీ పై ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మూవీని భారీ స్క్రీన్స్ పై రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కాని సలార్ సినిమాకి ఒక రోజు ముందుగా షారుఖ్ ఖాన్ డంకీ మూవీ కూడా రిలీజ్ అవుతోంది. అయితే ఈ సినిమా తెలుగులో రావడం లేదు. ఈ సినిమా కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో డంకీ ఎఫెక్ట్ అంత ఎక్కువగా ఉండదు. కాని హైదరాబాద్ లో మాత్రం డంకీ సినిమా ఎక్కువ స్క్రీన్స్ ఆక్యుపై చేసే అవకాశం ఉంది. ఇక గతంలో సాహో, ఆదిపురుష్ సినిమాలకి హైదరాబాద్ లో వెయ్యి షోలు పడ్డాయి.అయితే సలార్ మూవీకి మాత్రం అన్ని షోలు పడే అవకాశం లేదు.దీనికి 60, 40 రేషియో తో థియేటర్స్ కేటాయించే ఛాన్స్ కనిపిస్తోంది.


సలార్ మూవీతో పాటు క్రిస్మస్ కానుకగా డంకీ, హాలీవుడ్ మూవీ ఆక్వామెన్ కూడా రిలీజ్ అవుతోంది. అయితే ఈ రెండు సినిమాలకి 40 శాతం స్క్రీన్స్ కేటాయించే ఛాన్స్ కనిపిస్తోంది. మిగిలిన 60 శాతం స్క్రీన్స్ లో సలార్ మూవీని ప్రదర్శించనున్నారు. మూవీ సక్సెస్ బట్టి స్క్రీన్స్ సంఖ్య రెండో రోజు నుంచి పెరగడం లేదా తగ్గడం అనేది జరుగుతుంది. ఈ మూవీకి సంబందించిన ప్రమోషనల్ యాక్టివిటీస్ కూడా ఏమీ చేయడం లేదు. ఈ సినిమా నుంచి ఒక సాంగ్, యాక్షన్ ట్రైలర్ ని మాత్రమే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు ఆడియన్స్ కి రీచ్ అయితే సలార్ మూవీపై మళ్ళీ బజ్ అనేది క్రియేట్ అవుతుంది. రిలీజ్ కి ఇంకా తొమ్మిది రోజుల సమయం ఉన్న నేపథ్యంలో అగ్రెసివ్ గా మూవీని ఆడియన్స్ లోకి పంపించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక వారంలోగా 2 సాంగ్స్ ఇంకా సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్.నిర్మాత విజయ్ కిరంగదూర్ మాత్రమే ఇప్పటి దాకా మీడియా ముందుకి వచ్చి సినిమా విశేషాలు పంచుకున్నారు. ప్రభాస్ ఏమైనా బయటకి వచ్చే అవకాశం ఉందా లేదా అనేది క్లారిటీ లేదు కానీ ఖచ్చితంగా లేట్ అయినా ప్రమోషన్స్ చేస్తాడని క్లారిటీ వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: