ఈ కథ రాసుకున్నప్పుడే అలీ ని హీరో గా తీసుకోవాలని ఎస్వీ కృష్ణారెడ్డి నిర్ణయించుకున్నారట. అయితే ఇండస్ట్రీ లోని చాలా మంది కృష్ణారెడ్డి నిర్ణయాన్ని తప్పుబట్టారు. అలీని హీరో గా వద్దని సలహా ఇచ్చేరట. కానీ కృష్ణారెడ్డి ఆ కథ కి అలీ అయితేనే సరిపోతాడని భావించి సినిమాని తెరకెక్కించారు.
ఇక సినిమా రిలీజ్ అయిన తరువాత అలీ ని హీరో గా వద్దని చెప్పిన వారే.. అలీ నటన చూసి హ్యాట్సాఫ్ అన్నారు. ముఖ్యంగా మూవీ లో తల్లి చనిపోతుందని తెలుసుకున్న సీన్ దగ్గర అలీ పలికించిన హావభావాలు విమర్శకుల నుంచి చప్పట్లు వచ్చేలా చేసింది. ఈ సినిమాలోని సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఎస్వీ కృష్ణారెడ్డే ఈ సినిమా కి సంగీతం అందించారు. ముఖ్యంగా ‘సిరులొలికించే చిన్ని నవ్వులే’ సాంగ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఆకట్టుకుంటే.. ‘నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మో’ సాంగ్ యూత్ ని ఒక ఊపు ఊపేసింది. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా ఇంద్రజ, యముడిగా కైకాల సత్యనారాయణ, చిత్రగుప్తుడిగా బ్రహ్మానందం నటించి మెప్పించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి