దానికి రాజమౌళి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు తో ఒక సినిమా చేసుకున్నాడు, ఈ సినిమా పూర్తి అవ్వగానే ఆయన మహాభారతం సిరీస్ ని తెరకెక్కించాలని చూస్తున్నాడు. ఇందులో మోక్షజ్ఞ కి ఎదో ఒక చారిత్రాత్మక పాత్ర ని ఇవ్వొచ్చు అని అనుకుంటున్నారు. ఇలా చేస్తాడా, లేకపోతే మోక్షజ్ఞ తో సెపెరేట్ గా ఒక సినిమా తీసి , ఆ తర్వాత మహాభారతం తీస్తాడా అనేది తెలియాల్సి ఉంది.ప్రస్తుతం రాజమౌళి మరియు మోక్ష కాంబినేషన్ కి సంబంధించిన ఈ న్యూస్ సోషల్ మీడియా లో హాట్ టాపిక్ అయ్యింది. గతం లో మెగాస్టార్ చిరంజీవి( chiranjeevi ) కూడా ఇదే చేసాడు..ఆయన తనయుడు రామ్ చరణ్ ని చిరుత సినిమా తర్వాత రాజమౌళి చేతిలో పెట్టాడు. అలా వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన మగధీర చిత్రం ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో మనమంతా చూసాము. రేపు బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కూడా అదే సక్సెస్ అవుతాడని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు, మరి వారి కోరికలు నెరవేరుతాయా లేదా అనేది వచ్చే ఏడాది తెలిసిపోతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి