తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోయిన్ లలో శృతి హాసన్ ఒకరు. ఈ ముద్దు గుమ్మ కెరియర్ ప్రారంభంలో వరుస ఆపజాయలను ఎదుర్కొని ఐరన్ లెగ్ గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత గబ్బర్ సింగ్ మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకొని వరస అవకాశాలను దక్కించుకుంది. అలాగే ఈ నటి ఆ తర్వాత నటించిన చాలా సినిమాలు వరుసగా సక్సెస్ కావడంతో ఆ తర్వాత ఈ బ్యూటీ లక్కీ బ్యూటీగా మారిపోయింది. ఇకపోతే ఈ సంవత్సరం శృతి హాసన్ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోంది.

అందులో భాగంగా ఈ బ్యూటీ నటించిన సినిమాలో కూడా చాలా వరకు ఈ సంవత్సరం విజయాలను అందుకున్నాయి. మొదటగా ఈ నటి ఈ సంవత్సరం బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహా రెడ్డి మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత ఈ నటి మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య అనే పక్కా కమర్షియల్ సినిమాలో చిరంజీవి కి జోడిగా నటించింది. ఈ మూవీ కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇలా పోయిన సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయిన ఈ రెండు మూవీ లు మంచి విజయాలను అందుకున్నాయి.

ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ నటి నాచురల్ స్టార్ నాని హీరో గా మృణాల్ ఠాగూర్ హీరోయిన్ గా నటించిన హాయ్ నాన్న సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కూడా నటించింది. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే తాజాగా ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కూడా అద్భుతమైన టాక్ ను తెచ్చుకొని ప్రస్తుతం సూపర్ సాలిడ్ కలెక్షన్ లను వసూలు చేస్తుంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ సినిమా కూడా మంచి విజయం సాధించేలా ఉంది. ఇలా శృతి హాసన్ ఈ సంవత్సరం నటించిన దాదాపు అన్ని సినిమాలతో విజయాలను అందుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: