నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా డెవిల్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి అభిషేక్ నామ దర్శకత్వం వహించగా ... ఈ సినిమాలో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ మూవీ పోయిన సంవత్సరం డిసెంబర్ 29 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ లభించింది. దానితో ఈ సినిమాకు యావరేజ్ కలెక్షన్ లు ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతున్నాయి.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ నుండి ఈ సినిమా విడుదలకు ముందు ఈ చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద మొత్తంలో ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. సినిమా విడుదల అయిన తర్వాత ఈ మూవీ కి మిక్స్ డ్ టాక్ రావడంతో ఈ మూవీ పరవాలేదు అనే స్థాయిలో కలక్షన్ లను రాబడుతున్నప్పటికీ బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకోవడం మాత్రం కాస్త కష్టంగానే కనబడుతుంది. ఇకపోతే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే మొదటగా ఈ మూవీ బృందం ఈ సినిమాలో హీరోయిన్ గా సంయుక్త ను కాకుండా మృనాల్ ఠాకూర్ ను ఎంచుకుందట. అందులో భాగంగా మృణాకి కథను కూడా వినిపించగా ... ఈ నటి కి కూడా ఈ సినిమా కథ బాగా నచ్చడంతో ఇందులో నటించడానికి ఆసక్తిని చూపించిందట. కాకపోతే అదే సమయంలో మృణాకి వేరే సినిమాలు ఉండడంతో ఈ మూవీ లో నటించలేను అని ఈ మూవీ బృందానికి తెలియజేసిందట. దానితో ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాలో సంయుక్తా మీనన్ ను హీరోయిన్ గా తీసుకున్నట్లు ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: