టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా హనుమాన్. ఇందులో  యంగ్ బ్యూటీ అమృత అయ్యర్ హీరోయిన్గా కనిపించబోతోంది. యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. చిన్న సినిమా అయినప్పటికీ కంటెంట్ ఏదో కాస్త బాగా అనిపించడంతో స్టార్ హీరోల సినిమాకి పోటీగా హనుమాన్ రాబోతోంది. దీంతో ఈ సినిమా పైనే భారీ అంచనాలను పెట్టుకున్నారు ప్రేక్షకులు. కాగా ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా సినిమా ప్రమోషన్స్ని

సైతం శరవేగంగా జరుపుతున్నారు చిత్ర బృందం. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మెగా స్టార్ చిరంజీవి పాత్ర కూడా ఉండబోతోంది అని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నా సంగతి మన అందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ఫ్యాక్టర్ కూడా ఉందని టాక్‌. ప్రస్తుతానికి ఈ సినిమాలో మెగాస్టార్ ప్రజెన్స్ ఉందో లేదా అనేది సస్పెన్స్ గా ఉన్న.. సినిమా కోసం మెగాస్టార్ ఎంట్రీ మాత్రం కన్ఫామ్ అయిపోయింది. మెగాస్టార్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కాబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. దీనిపై మేకర్స్ కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు.

జనవరి 7న గ్రాండ్గా జరిగే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ వచ్చి సందడి చేయబోతున్నాడని. చిరంజీవి ఆగమనం ఫిక్స్ అయిపోయిందని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. మరి ఈ ఈవెంట్ లో మెగాస్టార్ సందడి చేయడం అంటే సినిమాకు మరింత హైప్‌ తెచ్చి పెట్టినట్లే. ఇక ఈ ఈవెంట్‌లో చిరంజీవి ఇంకెన్ని విషయాలు షేర్ చేసుకుంటాడో అనే ఆశక్తి ఫాన్స్ లో మొదలైపోయింది. ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన తదుపరి సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు మెగాస్టార్ చిరంజీవి.

మరింత సమాచారం తెలుసుకోండి: