ఈ కార్యక్రమంలో భాగంగా బాలయ్యతో తన తదుపరి సినిమా గురించి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి.. ప్రశాంత వర్మ ఇప్పటికే తన వద్ద 10మంది సూపర్ హీరోల కథలు ఉన్నాయని తెలిపారు. ఇదివరకు బాలకృష్ణ సినిమాలకు దర్శకుడుగా కాకపోయినా ఆయనతో కలిసి పనిచేశానంటూ తెలిపారు. దీంతో బాలయ్య బాబు తనకి బాగా క్లోజ్ అని ఆయనతో నరసింహస్వామి అవతారంలో ఒక సూపర్ మూవీ చేస్తానంటే చాలామంది నవ్వారని తెలియజేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను సైతం తిరగరాస్తుందని ప్రశాంత్ వర్మ తెలియజేశారు.
మరి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బాలయ్య తో ఈ తరహ సినిమా చేస్తారనే విషయం అభిమానులపై భారీ అంచనాలు పెట్టుకునేలా చేస్తున్నాయి.. ప్రస్తుతం బాలయ్య డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తన చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం రాజకీయపరంగా బాలయ్య చురుకుగానే వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా హనుమాన్ సీక్వెల్ని ఇటీవల ప్రకటించడం జరిగింది ఈ సినిమా షూటింగ్ కూడా త్వరగా పూర్తిచేసి విడుదల చేయాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా అయిపోయిన వెంటనే బాలయ్యతో తన తదుపరి సినిమా చేస్తారేమో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి