ఇక లేటెస్ట్ గా రాజా సాబ్ అంటూ మారుతి ప్రభాస్ సినిమా టైటిల్ పోస్టర్ వదిలారు. రాజా డీలక్స్ అనుకున్న టైటిల్ కాస్తా రాజా సాబ్ గా వచ్చారు. అయితే ఈ టైటిల్ పోస్టర్ లో ప్రభాస్ పేరులో ఒక ఎస్ అదనంగా వచ్చి చేరింది. సాధారణంగా ఇలా చూస్తే ఎవరైనా ప్రభాస్ కూడా న్యుమరాలజీని ఫాలో అవుతున్నాడని అనుకుంటారు. ప్రభాస్ పేరులోని మార్పుని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ చేశారు.
అయితే దీనిపై నిర్మాణ సంస్థ వివరణ ఇచ్చింది. కేవలం మిస్టేక్ వల్లే ప్రభాస్ పేరులో మరో ఎస్ పడిందని వారు అంటున్నారు. ఇంత పెద్ద పాన్ ఇండియా సినిమాలో ప్రభాస్ పేరుని సరిగా రాయలేదా అంటూ కొందరు నవ్వుకుంటున్నారు. కొందరేమో కవరింగ్ బాగుందని కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రభాస్ పేరులోని మార్పుతో రాజా సాబ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తప్పకుండా దీనిపై మేకర్స్ కచ్చితమైన క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ అంత తేలికగా ఈ విషయాన్ని తీసుకోరని చెప్పొచ్చు. ప్రభాస్ ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగతో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకు స్పిరిట్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ కనిపించనున్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి